రోజుకు వ్యాయామం ఎంత సేపు చేయాలి!

శరీరంలోని అధిక బరువు తగ్గాలన్నా,మనం ఆరోగ్యంగా ఉండాలన్నా వ్యాయామం చేయాలి. అయితే అది ఎంతసేపు? అధిక కొవ్వు కరగడానికి ఎంత సమయం వ్యాయామం చేయాలి? అసలు రోజుకు ఎంత సేపు వ్యాయమం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం ?

New Update
రోజుకు వ్యాయామం ఎంత సేపు చేయాలి!

రోజు వ్యాయామం చేసే వారికి షుగర్, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్‌, ఊబకాయం వంటి ప్రమాదకర జబ్బులు దరిచేరవు.అంతెందుకు వ్యాయామానికీ, మానసిక ఉత్సాహానికీ మధ్య బలమైన సంబంధం ఉందని పరిశోధనల్లో స్పష్టంగా గుర్తించారు. వ్యాయామం చెయ్యటం వల్ల రోజు మొత్తం ఉత్సాహంగా గడుస్తుంది. మనలో చురుకుదనం పెరుగుతుంది. జీవితాన్ని ఆహ్లాదభరితం చేసుకునేందుకు కూడా వ్యాయామం ఎంతో అవసరం.

వ్యాయామం రెండు రకాలుగా చెయ్యచ్చు. అవి తక్కువ సమయంలో ఎక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేయడం, ఎక్కువ సమయం పాటు తక్కువ తీవ్రతతో వ్యాయామాలు చేయడం. అయితే మరీ తేలికపాటి వ్యాయామంతో కానిచ్చెయ్యకుండా ఓ మోస్తరు నుంచి కఠినంగా చెయ్యటం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. వ్యాయామం చేసే సమయం అనేది సహజంగానే, ఒకరి శరీర కూర్పు, శరీర బరువు, శారీరక బలాన్ని బట్టి మారుతుంది.

వారానికి కనీసం 150 నిమిషాల మితమైన తీవ్రత గల ఏరోబిక్ కార్యకలాపాలను లేదా వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులలో కండరాలను బలోపేతం చేసే కార్యకలాపాలతో పాటు 75 నిమిషాల తీవ్రమైన తీవ్రత గల ఏరోబిక్ కార్యకలాపాలను చేయాలని చెబుతుంది. వ్యాయామం చేయడానికి గడిపిన సమయం కంటే మీ వ్యాయామాల నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా అంతే అవసరం. అలాగే డెస్క్ జాబ్స్ చేసేవారు మనం కూర్చునే సమయాన్ని వీలైనంత తగ్గించి, కనీసం ఎక్కువ సమయం నడక అలవాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు