/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-19-7-jpg.webp)
Period Pain Tips: మహిళలకు ప్రతీ నెల పిరీయడ్స్ రావడం కామన్. ఈ సమయంలో శరీరంలో చాలా మార్పులు వస్తాయి. మ్యుఖ్యంగా పొత్తి కడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ , ఉంటాయి. అయితే అందరిలో ఈ సమస్య ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ కొంత మందిలో మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి నొప్పితో బాధపడే వారు ఈ వ్యాయామాలతో నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
భుజంగాసనం
ఈ ఆసనం చాలా సింపుల్. పీరియడ్స్ సమయంలో ఈ ఆసనం వేయడం ద్వారా వెన్ను నొప్పి తగ్గడానికి భుజంగాసనాము మంచి చిట్కా. దీని వల్ల ఒంట్లో శక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆసనం మానసికంగా కూడా దృడంగా ఉంచుతుంది.
ప్లాంక్స్
ప్లాంక్స్ కండరాళ్ళను దృడంగా చేస్తాయి. దీని వల్ల బలహీనత తగ్గిపోయి బలంగా ఉంటారు. ఈ వ్యాయామం పీరియడ్స్ నొప్పి పై మంచి ప్రభావం చూపుతుంది.
స్విమ్మింగ్
చాలా మంది నెలసరి సమయంలో స్విమ్మింగ్ చేయడం సరైనది కాదని అనుకుంటారు. కానీ ఈ టైం లో స్విమ్మింగ్ చేయడం నొప్పిని తగ్గిస్తుంది. అలాగే బ్లీడింగ్ కూడా కంట్రోల్ లో ఉండడానికి సహాయపడుతుంది. ఇది రిలాక్షేశన్ కలిగించి మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
అధోముఖ స్వనాశనం
పీరియడ్స్ సమయంలో ఈ ఆసనం ప్రభావంగా పనిచేస్తుంది. దీని ద్వారా భుజం, చాతి బలంగా మారుతాయి. దీంతో శక్తి కూడా పెరుగుతుంది. నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. అందుకే అధోముఖ స్వనాశనం సరైన ఛాయిస్.
బలాసనం
బలాసనం నెలసరి సమయాల్లో మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ ఆసనం వేయడం ద్వారా పీరియడ్స్ వల్ల కలిగే మూడ్ స్వింగ్స్ దూరం అవుతాయి. అంతే కాదు ఇది వివిధ సమస్యలకు కూడా పరిస్కారంలా పని చేస్తుంది.
వాకింగ్
వాకింగ్ చాలా సులువైన ప్రక్రియ. వాకింగ్ చేయడం ద్వారా ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది పీరియడ్స్ సమయంలో వచ్చే స్ట్రెస్, ఆందోళనను తగ్గిస్తుంది. అందుకే పీరియడ్స్ ఉన్నప్పుడు బద్దకంగా అనిపించిన వాకింగ్ చేయడం మంచిది.
Also Read: Vasthu Tips: ఇంట్లోకి రాగానే ఆందోళనగా అనిపిస్తుందా..? వాస్తు ఏం చెప్తుందో చూడండి