ఖతార్ గవర్నమెంట్ ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. గత సంవత్సర కాలంగా గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నేవీకి చెందిన 8 మంది మాజీ అధికారులకు ఉరిశిక్ష విధించింది. శిక్ష పడిన అధికారుల్లో కొందరూ యుద్ద నౌకల్లో మేజర్ గా వ్యవహరించిన వారు ఉన్నారు.
వీళ్లు సంవత్సరం నుంచి ఖతార్ లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఖతార్ వెల్లడించిన ఈ ఉరి శిక్ష పై లీగల్ పరంగా చర్యలు తీసుకుంటామని భారత్ ప్రకటించింది. '' నేవీ మాజీ అధికారులకు ఉరి శిక్ష వేయడం అనేది షాకింగ్ విషయం. దీనికి సంబంధించిన పూర్తి తీర్పు కోసం భారత ప్రభుత్వం ఎదురు చూస్తుంది.
Also read: స్టార్ నటుడి చెంప పగల కొట్టిన జయప్రద!
అధికారుల కుటుంబాలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నట్లు భారత దౌత్యాధికారులు ప్రకటించారు. న్యాయపరమైన అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వారు వివరించారు. ఈ తీర్పుని మేము సవాల్ చేస్తున్నట్లు భారత అధికారులు ప్రకటించారు. అధికారులను విడిపించడం కోసం ఇప్పటికే అనేక సార్లు బెయిల్ దరఖాస్తు చేశాం.
కానీ వాటిని ఖతార్ అధికారులు తిరస్కరించారు. అంతే కాకుండా అధికారులు జైలు శిక్షను పెంచుతూ వచ్చారు. చివరికి ఇలా ఉరి శిక్షను విధించినట్లు సంచలన తీర్పుని ఇచ్చింది. గతేడాది ఆగస్టులో ఖతార్ పోలీసులు 8 మంది ఇండియన్ నేవీ మాజీ అధికారుల్ని అరెస్ట్ చేశారు.
వీరంతా కూడా ఇజ్రాయేల్ కి గూఢచారులుగా వ్యవహరిస్తున్న అనుమానంతో అదుపులోకి తీసుకుంది. ఖతార్ లో ఓ కంపెనీలో పని చేస్తూనే ఇలా గూఢచారులుగా చేస్తున్నారని ఆరోపించింది. అప్పటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు ఈ 8 మంది సిబ్బంది కూడా. మరణ శిక్ష ఎదుర్కొంటున్న వారిలో కెప్టెన్లు నవతేజ్ సింగ్ గిల్, బీరేంద్ర కుమార్ వర్మ, సౌరభ వశిష్ఠ, కమాండర్లు అమిత్ నాగ్‌పాల్, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్ ఉన్నారు. వీరిపై గతేడాది ఆగస్టులో ఖతార్ అభియోగాలు మోపింది.
Also read: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ కు మరో షాక్..ఎమ్మెల్సీ పదవికి ఆ నేత రాజీనామా!