Ex MP Harsh Kumar : కోడికత్తి శ్రీనుని ఎంతకాలం జైల్లో ఉంచుతారు?: మాజీ ఎంపీ హర్షకుమార్

కోడికత్తి శ్రీనుని ఎంతకాలం జైల్లో ఉంచుతారు? న్యాయం ధర్మం లేవా? అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. శ్రీనుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

New Update
Ex MP Harsh Kumar : కోడికత్తి శ్రీనుని ఎంతకాలం జైల్లో ఉంచుతారు?: మాజీ ఎంపీ హర్షకుమార్

Ex MP Harsh Kumar : కోడికత్తి శ్రీనుకు మద్దతుగా రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్ ఇంటి వద్ద సంఘీభావ దీక్షా చేపట్టారు. కోడికత్తి శ్రీనుని ఎంతకాలం జైలులో ఉంచుతారు? న్యాయం ధర్మం లేవా? అని ప్రశ్నిస్తున్నారు. 5 సంవత్సరాల నుండి జైలులో ఉన్న తమ కొడుకుని వెంటనే విడుదల చేయాలని విజయవాడలో శ్రీను తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. మరోపక్క కోడి కత్తి శ్రీను కూడా దీక్షా చేస్తున్నారు. అయితే, వారికి మద్దతుగా ఇంటివద్దే దీక్షా చేస్తున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్.

న్యాయం ఒకేలా ఉండాలి

అందరికీ న్యాయం ఒకేలాగా ఉండాలని, జగన్ కి తగిలిన గాయం 307 పెట్టెంత గాయం కాదని స్పష్టం చేశారు. గాయం తగిలిన వెంటనే చికిత్స చేయించుకోకుండా హైదరాబాద్ ప్లయిట్ లో వెల్లి పోయారని.. అటువంటి దానికి 307పెట్టడమే తప్పని.. దీనికి ఇంతకాలం జైల్ లో ఉంచటం పొరపాటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు హాజరు కావాలని అనేక మార్లు పిలిచినా జగన్ హాజరు కాలేదని.. సామాన్యులకు ఐతే సాక్ష్యం చెప్పాలని నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇచ్చి అరెస్టు చేసి కోర్టుకి రప్పించి సాక్ష్యం చెప్పిస్తారని అన్నారు.

Also Read: జూ. ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు.. బాలయ్యకు కొడాలి నాని కౌంటర్

కక్షపూరితం..

జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు న్యాయవ్యవస్థకు అతీతుడుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక దళిత బిడ్డ ఐదు సంవత్సరాల నుండి బెయిల్ లేకుండా జైల్లో  మగ్గుతున్నాడని..వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనికరం లేకుండా.. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఈ జరిగిన ఘటనలో కుట్రలేదని నేషనల్ ఇంటెలిజెన్స్ సంస్థ తేల్చిచెప్పిందన్నారు. రాష్ట్రంలో దళితులను అందరిని ఏదో విధంగా బాధిస్తూనే ఉన్నారని కామెంట్స్ చేశారు.

అర్హుడు కాదు

రాష్ట్రంలో అత్యంత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారని..అదే చేతులతో దళితులను హింసిస్తున్నారని వ్యాఖ్యనించారు. దళితుల ఆత్మ శోధిస్తుందని.. ఆ విగ్రహ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి అర్హుడు కాదని అన్నారు. విచారణలో జనపల్లి శ్రీనివాస్ కుటుంబం వైయస్సార్ పార్టీ అభిమాని అని తేలిందని.. అదే సమయంలో ఒక లెటర్ కూడా శ్రీను రాశాడని అవన్ని బయట పెడితే వాస్తవం తెలుస్తుందని స్పష్టం చేశారు. వెంటనే జగన్ పై NBW జారీచేసి అతడిని అరెస్టు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు