Chintha Mohan: ఇండియా కూటమికి జగన్ అవసరం లేదు.. మాజీ ఎంపీ సెన్సేషనల్ కామెంట్స్..!
ఇండియా కూటమికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవసరం ఏమాత్రం లేదన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్. బీజేపీ, వైసీపీ రెండు పార్టీలు ఒకటేనని విమర్శించారు. మోదీ పర్మిషన్‌తోనే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారన్నారు.
Chintha Mohan: ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ నిరసన చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ ను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్లను ఇందిరాగాంధీ హయాంలో ప్రారంభించామని, అయితే నేడు అవి మూతపడ్డాయని అన్నారు.
వైసీపీ హయాంలో ఎస్సీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణాన్ని ఎవరు ఆపలేరన్నారు. దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణానికి ప్రధాన శత్రువు ఆదాని అని.. ఓడరేవు నిర్మాణం జరిగితే ఆదానికి ఆదాయం తగ్గుతుందన్న భయం ఏర్పడిందని కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలోనే ఇండియా కూటమికి మాజీ సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి అవసరం ఏమాత్రం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డిని సొంత చెల్లి షర్మిలనే ప్రతిరోజు విమర్శలు చేస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీ వైసీపీ ఒకటేనని, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి చేసిన ధర్నాకు మోడీ పర్మిషన్ ఇచ్చారని అన్నారు.

Also Read: గిరిజన సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష.. ఇకపై డోలీ మోతలు కనిపించకూడదని కీలక ఆదేశాలు..!