TDP: మాకు రక్షణ కల్పించండి.. ఎన్నికల అధికారులకు మాజీ ఎమ్మెల్యే విజ్ఞప్తి..! ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ అభ్యంతరాలపై ఆధారాలు చూపాలంటూ గుడివాడ ఆర్వో ఇచ్చిన నోటీసులపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే రావి. మున్సిపల్ కమిషనర్ ధ్రువీకరించిన పత్రాన్ని ఆర్వోకు అందజేశారు. అనంతరం ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని తమకు రక్షణ కల్పించాలని కోరారు. By Jyoshna Sappogula 27 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి EX MLA Ravi: ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ అభ్యంతరాలపై ఆధారాలు చూపాలంటూ గుడివాడ ఆర్వో ఇచ్చిన నోటీసులపై స్పందించారు టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ధ్రువీకరించిన పత్రాన్ని ఆర్వోకు అందజేశారు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నేత తులసి బాబు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. పిచ్చిపిచ్చిగా వాగితే సమాధానం కూడా అదే స్థాయిలో ఇవ్వాల్సి వస్తుందన్నారు. Also Read: వైసీపీ సర్కార్ పై అంబటి హాట్ కామెంట్స్.. యువత అభివృద్ధి చెందాలంటే ఇలాంటి వాళ్లే రావాలి..! మాజీ ఎమ్మెల్యే రావి మాట్లాడుతూ.. సాక్షాత్తు గుడివాడ మున్సిపల్ కమిషనర్ ధ్రువకరించిన పత్రాన్ని ఆర్వోకు అందజేసిన కొడాలి నాని నామినేషన్ పై ఇచ్చిన అభ్యంతరాన్ని తోసిపుచ్చారన్నారు. నిన్న స్కృటీనీలో ఆర్వోకు ఇచ్చిన ఆధారాలనే నేడు తిరిగి అందజేశామన్నారు. కేవలం ఎమ్మెల్యే కొడాలి నాని ప్రలోభాలకు లొంగి తమ అభ్యంతరాలను ఆర్వో పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. గుడివాడలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ ఎన్నికల సంఘ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని తమకు రక్షణ కల్పించాలని కోరారు. #ex-mla-ravi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి