AP: ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైంది: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

టీడీపీ పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందన్నారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్నారు. వినుకొండలో మూడు హత్యలు జరిగాయని.. ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP: ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైంది: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
New Update

EX MLA Bolla Brahmanaidu: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్నారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ దాడిలో గాయపడిన 25 మంది వైసీపీ కార్యకర్తలకు పార్టీ తరపున జగన్ ఆర్ధిక సాయం పంపించారని.. బాధితులకు ఆర్థిక సాయం అందచేస్తామని తెలిపారు. రాష్టంలో తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలు పెరిగిపోయాయని విమర్శలు గుప్పించారు.

Also Read: ఎవరైనా సరే దాడులు చేస్తే సహించేది లేదు.. ఎమ్మెల్యే యరపతినేని సీరియస్ వార్నింగ్

వైసీపీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని.. ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వినుకొండలో మూడు హత్యలు జరిగాయని.. ఇప్పటికి రెండు కేసులలో నిందితుల్ని అరెస్ట్ చేయలేదని వ్యాఖ్యానించారు.

నియోజకవర్గంలో అనేక మంది అర్హులైన వారికి ఫించన్లు నిలిపివేశారన్నారు. తెలుగుదేశం కండువా కప్పుకుంటే ఫించన్లు ఇస్తామనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారని.. మంచి పాలన అందివ్వాలని సూచించారు.

#ex-mla-bolla-brahmanaidu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe