Banoth Chandravathi : బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే చంద్రవతి?

బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. భట్టి,చంద్రావతి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. గిరిజన తండా - కాంగ్రెస్‌కు అండ ట్యాగ్ లైన్ పేరిట నెట్టింట్లో వీరి ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి.

New Update
Banoth Chandravathi : బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే చంద్రవతి?

Ex MLA Banoth Chandravathi join To Congress: బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి కాంగ్రెస్(Congress) పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. టికెట్ రాదని భావిస్తున్న నేతలు కాంగ్రెస్ లోకి క్యూకట్టారు. ఈ క్రమంలోనే ఖమ్మం(Khammam) జిల్లాలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగలనుంది. వైరా(Wyra) మాజీ ఎమ్మెల్యే బానోత్‌ చంద్రావతి(Ex MLA Banoth Chandravathi) హస్తం గూటికి వెళ్లనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. భట్టి,(Batti) చంద్రావతి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గిరిజన తండా-కాంగ్రెస్‌కు అండ ట్యాగ్‌లైన్ పేరిట వీరి ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఖమ్మం జిల్లాలో కొత్తగా ఏర్పడిన వైరా నియోజకవర్గం నుంచి 2009లో బానోత్‌ చంద్రావతి విజయం సాదించారు. అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలిగా అప్పట్లో సంచలనం సృష్టించారు డాక్టర్ చంద్రావతి. సీపీఐ(CPI) పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాదించిన చంద్రావతి ఆ తర్వాత 2014 ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో టిక్కెట్‌ రానప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉంది. కనీసం ఈసారైనా  కన్ఫర్మ్ గా టిక్కెట్ వస్తుందని భావించింది. అయితే ఊహించని విధంగా  బీఆర్ఎస్ మాజా ఎమ్మెల్యే మదన్‌లాల్(Ex MLA Madhan Lal) కు టిక్కెట్ ఇవ్వడంతో ఆమోకు నిరాశ తప్పలేదు. దీంతో పార్టీ మారాలనుకున్నారో ఏమో తెలియదు కానీ కాంగ్రెస్ లోకి వెళ్లుతున్నట్లు రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది.

Also Read: గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణనే..ఎన్నికల సంఘం ప్రకటన!

ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) టిక్కెట్  దక్కనివారు తమ రాజకీయ భవిష్యత్తు, ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు. అవకాశం దక్కనిచోట ఎందుకు ఉండాలని, ఇతర పార్టీల్లోకి వెళదామని అనుచరులు నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏ పార్టీలో చేరితే ఏ మేర ప్రయోజనం ఉంటుందన్న దానిపై అసంతృప్తులు అంచనాలు వేసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్‌(CM KCR) ముందుగానే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం రాష్ట్రంలో కాక రేపుతోంది.
మూడు ప్రధాన పార్టీలోనూ పొలిటికల్ హిట్‌ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఏయే నేతలు ఏ పార్టీ వైపు వెళ్తారనేది చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌ అసంతృప్తులపై కన్నెసిన ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ (BJP) వారికి గాలం వేసి, తమ తరఫున బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.  అయితే అసంతృప్తి నేతలు పార్టీలు మారుతున్న బీఆర్ఎస్ వీ డోంట్ కేర్ అన్నట్లుగా భావిస్తుంది. ఈ సారి ఎన్నికల్లో కూడా మూడోసారి ముచ్చటగా తామే గెలుస్తామంటూ ధీమ వ్యక్తం చేస్తుంది.

Also Read: మంత్రి జగదీశ్ రెడ్డి ఓడిపోవడం ఖాయం

Advertisment
తాజా కథనాలు