Gunda Appala: టీడీపీ అధినాయకత్వంపై మాజీ మంత్రి గుండ అసంతృప్తి

టీడీపీ అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ. అసమ్మతికి టికెట్ ఇవ్వడం ఏ మాత్రం సరైన పని కాదని హెచ్చరించారు. అచ్చెన్నాయుడు పార్టీని ముంచేస్తున్నాడని ఆరోపించారు.

Gunda Appala: టీడీపీ అధినాయకత్వంపై మాజీ మంత్రి గుండ అసంతృప్తి
New Update

Also Read: ఆన్లైన్లో వేధింపులకు పాల్పడితే ఈ వాట్సప్ నంబర్ కు ఫిర్యాదు చేయండి: ఎస్పీ

తమకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ఏ నామినేటెడ్ పదవులు వద్దని ఎమ్మెల్యే టికెట్ కావాలని గుండ అప్పల సూర్యనారాయణ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో సమస్యలు చెప్పినా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు పార్టీని ముంచేస్తున్నాడని ఆరోపించారు.


Also Read: వివేకాను హత్య చేసి తప్పు చేశా.. ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నా.. దస్తగిరి సంచలనం!

ఇప్పటికైనా చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకుని శ్రీకాకుళంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. తనకు వ్యక్తిగత అజెండా ఏమీ లేదని క్యాడర్ ఎలా చెబితే అలాగేనని గుండా కొత్త వ్యాఖ్యానించారు. యువతకు టిక్కెట్ ఇవ్వడంపై తమకు అభ్యంతరం లేదని కానీ అసమ్మతికి టికెట్ ఇవ్వడం మాత్రం సరైన పని కాదని చంద్రబాబు గ్రహించాలన్నారు. టికెట్ గుండ ఫ్యామిలీకి ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడిన వారికైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

#ex-minister-gunda-appala-suryanarayana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe