DS Health update: అత్యంత విషమంగా డీఎస్ ఆరోగ్య పరిస్థితి.. ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స..! మాజీ మంత్రి డి.శ్రీనివాస్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇవాళ హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు డీఎస్. గతంలో పీసీసీ చీఫ్‌గా పనిచేశారు డీఎస్. కిడ్నీ సమస్య, పక్షవాతంతో బాధపడుతున్నారు డీఎస్. తఊపిరి తీసుకోవడంతో ఇబ్బంది పడుతున్న ఆయనకు.. సెప్టెక్ షాక్‌తో పాటు మల్టీ ఆర్గన్ డిస్‌ఫంక్షన్ ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఇంటెన్సీవ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు. By Trinath 11 Sep 2023 in Latest News In Telugu నిజామాబాద్ New Update షేర్ చేయండి D Srinivas rao health issues: మాజీ మంత్రి డి.శ్రీనివాస్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో ఆయన ఇవాళ(సెప్టెంబర్ 11)న అడ్మిట్ అయ్యారు. ఊపిరి తీసుకోవడంతో ఇబ్బంది పడుతున్న ఆయనకు.. సెప్టెక్ షాక్‌తో పాటు మల్టీ ఆర్గన్ డిస్‌ఫంక్షన్ ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఇంటెన్సీవ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు. డి.శ్రీనివాస్ హెల్త్ బులెటిన్ గతంలో పీసీసీ చీఫ్‌గా పనిచేశారు డీఎస్. కిడ్నీ సమస్య, పక్షవాతంతో బాధపడుతున్నారు డీఎస్. తన తండ్రిని ఆస్పత్రిలో చేర్చినట్లు ట్వీట్ చేశారు ఎంపీ అర్వింద్. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు డీఎస్. నిజామాబాద్ ఎంపీగా డీఎస్ చిన్న కుమారుడు అర్వింద్ ఉన్నారు. అటు కాంగ్రెస్‌లో చేరారు డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ పిలుపుతో బీఆర్‌ఎస్‌లో చేరారు డీఎస్. రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు ధర్మపురి శ్రీనివాస్. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. వైద్య బృందం ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తోంది. ధర్మపురి శ్రీనివాస్ సెప్టెంబర్ 27, 1948లో జన్మించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు ఆయన స్వగ్రామం. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు డీఎస్. 1983లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన డీఎస్. 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి 3 సార్లు గెలిచారు. ఏడు సార్లు నిజామాబాద్ అర్బన్, ఓసారి రూరల్ నుంచి పోటీ చేశారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు డీఎస్. 2014 వరకు తెలంగాణ కాంగ్రెస్‌లో నెంబర్2గా ఉన్నారు డీఎస్. 1988లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ధర్మపురి శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. నిజామాబాద్ ఎంపీగా చిన్న కుమారుడు అర్వింద్ ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్ద కుమారుడు సంజయ్ చేరారు. బ్రెయిన్ స్ట్రోక్: కొంతకాలంగా బ్రెయిన్ స్ట్రోక్ సమస్యతో బాధపడుతున్నారు డీఎస్. సోమవారం(సెప్టెంబర్ 11) మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డీఎస్.. 2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. హస్తం పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మారారు. టీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు డీఎస్. చిన్నకుమారుడు బీజేపీలో చేరడంతో బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటూ వచ్చారు డీఎస్. కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడిగా పనిచేసిన ఆయన ఉమ్మడి ఏపీలో రెండుసార్లు పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది డీఎస్ కాంగ్రెస్ చేరిక కార్యక్రమం వివాదస్పదంగా మారింది. డీఎస్‌కు కాంగ్రెస్ ఇంచార్జి థాక్రే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ALSO READ: చంద్రబాబు హౌస్ రిమాండ్ పై తీర్పు రేపటికి వాయిదా #d-srinivas-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి