/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/uber-driver-jpg.webp)
ఉబర్, ఓలా, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో చాలా మంది జాబ్ చేస్తూనే ఈ సంస్థల్లో పని చేస్తుంటారు. పార్ట్‌టైమ్‌గా డ్రైవ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. ప్రస్తుతం ఒక్క జాబ్‌తో లైఫ్ సెటిల్ అవ్వని పరిస్థితి. కొంతమంది అప్పులు తీర్చడం కోసం.. మరికొంతమంది కుటుంబ ఆర్థిక సమస్యలతో ఇలా పార్ట్‌టైమ్ చేస్తుంటారు. ఇంకొంతమందికి ఇదే ఫుల్ టైమ్ జాబ్. అయితే ఈ లిస్ట్‌లోకి కొత్త కారణం వచ్చి చేరింది. అదేంటో తెలుసుకోండి.
My Uber Moto driver is ex-google, moved to Bangalore 20 days ago from Hyderabad.
He is just doing this to explore the city it seems. pic.twitter.com/C2zA71fMdJ
— Raghav Dua (@GmRaghav) October 22, 2023
రాఘవ్ దువా అనే నెటిజన్ ఉబర్ బైక్ బుక్ చేసుకున్నాడు. అతనితో మాటలు కలిపాడు. అయితే అతను చెప్పిన విషయాలతో ముందు ఒక్కసారిగా కంగుతిన్నాడు. తాను గూగుల్ మాజీ ఉద్యోగి అని చెప్పాడు ఆ డ్రైవర్. 20 రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్లాడట. బెంగళూరుని చూడాలన్న తన కోరికను నెరవేర్చుకోవడానికి ఉబర్ డ్రైవర్ అవతారం ఎత్తాడు ఆ డ్రైవర్. ఇది వినగానే రాఘవ్ దువా షాక్ అయ్యాడు. అయితే అదే సమయంలో అతని బ్రెయిన్‌కి ఫిదా అయ్యాడు. మనుషులు ఇలా కూడా ఆలోచిస్తారా అని ఆశ్చర్యపోతూ జరిగిన విషయాన్ని సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఆ ఉబర్ డ్రైవర్ ఆలోచనను అందరూ మెచ్చుకుంటున్నారు.
True, I met a 53 year old ex bank manager from Vishakhapatnam who is now living in Delhi to meet people by riding Rapido, he wants to explore all the places in the city & make documentary on it, tough guy.
— Philosopher (@Sparta200216) October 23, 2023
రాఘవ్ దువా చేసిన ట్వీట్‌కి అనేక రిప్లైలు వచ్చాయి. అందులో కొందరి కామెంట్స్ చదివితే మరో విషయం అర్థమవుతుంది. ఈ ఉబర్ డ్రైవర్‌లాగా చాలా మంది ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఓ నెటిజన్ ఈ విధంగ కామెంట్ చేశారు. 'నిజమే, నేను విశాఖపట్నంకు చెందిన 53 ఏళ్ల మాజీ బ్యాంక్ మేనేజర్‌ని కలిశాను, అతను ఇప్పుడు ఢిల్లీలో రాపిడో రైడింగ్ ద్వారా ప్రజలను కలవడానికి నివసిస్తున్నాడు, అతను నగరంలోని అన్ని ప్రదేశాలను అన్వేషించి దానిపై డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నాడు.' అని కామెంట్ చేశారు. మరో నెటిజన్ నిషిత్ పటేల్ ఇలా కామెంట్ చేశారు. 'ఈ రోజు నేను అనుభవించిన క్రేజీ పీక్ బెంగళూరు క్షణాన్ని మీరు నమ్మరు! నేను కుబెర్నెటీస్ మీట్‌అప్‌కి వెళుతున్నప్పుడు, నా రాపిడో కెప్టెన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్‌ను తీసుకున్నాడు. అతను DevOps ఇంజనీర్ అని తెలిసింది' అంటూ ట్వీట్ చేశాడు.
Also Read: ఇదేం కొట్టుడు సామీ.. వరల్డ్‌కప్ హిస్టరీలో ఫాస్టెస్ సెంచరీ..!