Amzath Basha: ఓటమి చెందినా సరే.. చేసేది ఇదే.. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సంచలన వ్యాఖ్యలు.!

ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. అధికారంలో ఉన్న లేకపోయినా బాధ్యతగా పనిచేస్తామని.. జవాబుదారిగా ఉంటామని అన్నారు. కోవిడ్ సమయంలో మినహా ఎన్నడూ లేని అభివృద్ధి చేశామన్నారు. దశాబ్దాల కాలంగా కడప వివక్షకు గురైందని కామెంట్స్ చేశారు.

New Update
Amzath Basha: ఓటమి చెందినా సరే.. చేసేది ఇదే.. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సంచలన వ్యాఖ్యలు.!

EX Deputy CM Amzath Basha: కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు. అధికారంలో ఉన్న లేకపోయినా బాధ్యతగా పనిచేస్తామని.. జవాబుదారిగా ఉంటామని అన్నారు. దివంగత నేత వైఎస్ తర్వాత జగన్ (YS Jagan) సీఎం అయ్యాకే అభివృద్ధి జరిగిందన్నారు. అయిదేళ్లు పరిపాలించిన కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు (Chandrababu) కడప జిల్లాపై వివక్ష చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం ఎన్నో సార్లు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందన్నారు.

Also Read: జగన్ ఆదేశిస్తే రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్..!

ఎలాంటి తప్పు చెయ్యని మా నేత జగన్ ను జైల్లో పెట్టారని.. అయినా ఆదరని బేధరని నేత జగన్ అని వ్యాఖ్యానించారు. ఇద్దరితో ప్రారంభమైన వైసీపీ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించిందన్నారు. ఓటమి చెందినా అదే స్పూర్తితో పనిచేస్తామని..ప్రజల గొంతుకగా పనిచేస్తామని పేర్కొన్నారు. 2005లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని..కార్పొరేటర్ స్థాయి నుంచి జగన్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే గా గెలిచానని అన్నారు.

Also Read: ఆ చెత్త అధికారి వల్లే జగన్ ఓటమి.. మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిపించారన్నారు. పదేళ్లు ప్రజాసేవకే అంకితమయ్యానని.. శత్రువైనా నా గడప తొక్కి వస్తే అందరించారన్నారు. తమ లక్ష్యం నగరాన్ని అభివృద్ధి చెయ్యడమేనన్నారు. కోవిడ్ సమయంలో మినహా ఎన్నడూ లేని అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. దశాబ్దాల కాలంగా కడప వివక్షకు గురైందన్నారు. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగానే తమ పోరాటాలు ఉంటాయన్నారు. రెండు పర్యాయలు ఎమ్మెల్యేగా గెలిపించిన కడప ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు