EMRS Recruitment 2023: దేశ వ్యాప్తంగా ఏక లవ్య మోడల్ రెసిడెన్షియల్(Ekalavya Model Residency) స్కూళ్ల లో ఖాళీగా ఉన్న 10,391 ఖాళీల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు అక్టోబర్ 19 తో ముగియనుంది. నేటితో గడువు ముగుస్తుండడంతో ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనట్లు అయితే..వెంటనే తమ ఆప్లికేషన్స్ సమర్పించాల్సి ఉంటుంది.
డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్ విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్- 2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. ఆగస్టులోనే వీటికి సంబంధించిన ప్రక్రియ ముగిసింది. కానీ మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించారు.ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు మంచి జీతం అందుకోనున్నారు. పూర్తి వివరాలను https://emrs.tribal.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
Also Read: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3,282 ఉద్యోగాలపై కీలక ప్రకటన…!!
వాస్తవానికి ప్రిన్సిపల్, పీజీటీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు జులై 31 తో గడువు ముగియగా..టీజీటీ, హాస్టల్ వార్గెన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 19 వరకు దరఖాస్తులు సమర్పించడానికి నెస్ట్స్ అవకాశం ఇచ్చింది. ప్రిన్సిపల్ పోస్టులకు రూ. 2000 , పీజీటీ పోస్టులకు రూ.1500 , నాన్ టీచింగ్ పోస్టులకు ర. 1000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నియమకానికి జూన్ నెల చివరలో 4,062 పోస్టులకు.. ఆ తరువాత కొద్ది రోజులకు మరో 6,329 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ రెండు నోటిఫికేషన్ల కింద మొత్తం 10,391 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ప్రిన్సిపల్: 303 పోస్టులు.
అర్హత: బీఈడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. కనీసం 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి. 50 సంవత్సరాలకు మించకూడదు. రూ.78,800-రూ.2,09,200. వరకు జీతం ఉంటుంది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 2266 పోస్టులు.
విద్యార్హత: బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత. 40 సంవత్సరాలకు మించకూడదు. రూ.47,600-రూ.1,51,100 వరకు జీతం ఉంటాయి.
టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ; టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 18.8.2023 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.