/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/eluru-jpg.webp)
TDP Ex MP Maganti Babu : ఏలూరు జిల్లాలో అనూహ్య రాజకీయా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీని వీడిన మాజీ ఎంపీ మాగంటి బాబు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో మాగంటి బాబు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ టికెట్ పుట్టా మహేష్ యాదవ్ కు కేటాయించడంతో ఎంపీ సీటుపై ఆశపడ్డ టీడీపీ సీనియర్ నేతలు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: టీడీపీలో పరిటాల కుటుంబ తీరుపై ఉత్కంఠ..!
గోరుముచ్చు గోపాల్ యాదవ్ సైతం వైసీపీకు వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు గోరుముచ్చు గోపాల్ యాదవ్. యనమల రామకృష్ణుడే తనకు టికెట్ రాకుండా చేశాడంటూ ఆరోపణలు చేశారు. ఏలూరు రాజకీయాల్లో టీడీపీ తరపున చక్రం తిప్పిన మాగంటి బాబు 2014లో టీడీపీ నుంచి ఎంపీ గా గెలిచారు.
Also Read: ఆళ్లగడ్డలో విచ్చలవిడిగా గంజాయి.. బయటపెట్టిన అఖిల ప్రియ
2019లో ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2024 ఎన్నికల్లో ఏలూరు ఎంపీ సీటు ఆశించిన మాగంటి. ఎంపీ టికెట్ పుట్టా మహేష్ యాదవ్ కు కేటాయించడంతో మాగంటి అలకబూనినట్లు ప్రచారం జరుగుతోంది. మాగంటి తోపాటు అతడి బలమైన టీడీపీ కేడర్ కూడా వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. మాగంటి పార్టీ మారుతున్నారనే ప్రచారంతో టీడీపీ కార్యకర్తలు డైలమాలో ఉన్నారు. మాగంటి వైసీపీ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందని.. ఇంకా అధికారింకంగా ప్రకటించడమే ఆలస్యమని అంటున్నారు.