AP: మిస్టరీగా మారిన చేబ్రోలు యువతి మిస్సింగ్ కేసు..!

ఏలూరు జిల్లా చేబ్రోలులో యువతి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. ఘటన జరిగి రెండు వారాలు గడిచినా యువతి జాడ మాత్రం తెలియడం లేదు. తమ మనవరాలి జాడ కనిపెట్టి తమకు అప్పగించాలని వృద్ధురాలు అధికారులను వేడుకుంటుంది.

New Update
AP: మిస్టరీగా మారిన చేబ్రోలు యువతి మిస్సింగ్ కేసు..!

Eluru: ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోలులో యువతి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. ఈ నెల 2వ తేదీన తమ మనవరాలు పిచ్చెట్టి జానకి(20) కనబడటం లేదంటూ గుడ్ల లక్ష్మీ చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజు సాయంత్రం నారాయణపురం బ్రిడ్జిపై నుంచి ఓ యువతి కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. కాలువలో దూకిన యువతి పిచ్చెట్టి జానకి(20) గా అనుమానించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: అందుకే వైసీపీలో ఇబ్బంది పడ్డా.. మాజీ మంత్రి బాలినేని ఎమోషనల్ కామెంట్స్..!

రెండు మూడు రోజుల పాటు గజ ఈతగాళ్ళ సాయంతో కాలువను జల్లెడ పట్టినా యువతి ఆచూకీ లభించలేదు. ఘటన జరిగి రెండు వారాలు గడిచినా యువతి జాడ మాత్రం తెలియలేదు. ఇప్పటికీ వెతుకుతున్నాం అని చెబుతోన్నారు పోలీసులు. జానకి అమ్మమ్మ లక్ష్మీ తప్ప ఆమె తరఫు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో కేసు ముందుకు కదలని పరిస్థితి కనిపిస్తోంది.    వృద్ధురాలు మాత్రం తమ మనవరాలి జాడ కనిపెట్టి అప్పగించాలని అధికారులను వేడుకుంటుంది. కాగా, పోలీసుల నిర్లక్ష్యంతో చేబ్రోలు యువతి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారిందని స్థానికులు అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు