Electric Scooters: ఎలక్ట్రిక్ టూవీలర్స్ ధరల షాక్.. వామ్మో భారీగా పెంచేశారుగా.. 

ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం సబ్సిడీని తగ్గించడంతో ఆ భారం వినియోగదారులపై పడుతోంది. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా సబ్సిడీ ఇచ్చేది. . ఇప్పుడు అది తగ్గింది. దీంతో టూవీలర్ కంపెనీలు 16 వేల రూపాయల వరకు ఎలక్ట్రిక్ వెహికిల్స్ ధరలను పెంచాయి. 

Electric Scooters: ఎలక్ట్రిక్ టూవీలర్స్ ధరల షాక్.. వామ్మో భారీగా పెంచేశారుగా.. 
New Update

ఎలక్ట్రిక్ టూవీలర్స్(Electric Scooters) కంపెనీలు తమ ఈవీల ధరలను పెంచడం ప్రారంభించాయి. ఎందుకంటే, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఈవీ కంపెనీలకు సబ్సిడీగా వచ్చే మొత్తం తగ్గిపోయింది. వాస్తవానికి, FAME-II పథకం చెల్లుబాటు 31 మార్చి 2024న ముగిసింది. దాని స్థానంలో, కొత్త ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS) ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా ఏథర్, బజాజ్, టీవీఎస్, విడా వంటి పెద్ద ఈవీ కంపెనీలు తమ ద్విచక్ర వాహనాల ధరలను రూ.16,000ల వరకు పెంచాయి. ఓలా ఎలక్ట్రిక్ ధరల పెంపును ప్రకటించనప్పటికీ, త్వరలోనే తన వాహనాల ధరల(Electric Scooters) పెంపుదలను వెల్లడించవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం, కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను పండుగ ఆఫర్‌లో విక్రయిస్తోంది.

ఎమ్మార్పీపై ప్రభుత్వ రాయితీ  రూ.10 వేలు..
కొత్త పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ టూ వీలర్, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ - ఈ-రిక్షాల ఎమ్మార్ఫీ పై ప్రభుత్వం 10 వేల రూపాయల సబ్సిడీ ఇస్తుంది. ప్రస్తుతానికి, ఇందులో ఎలక్ట్రిక్ 4 వీలర్లను చేర్చడం గురించి ఎటువంటి సమాచారం లేదు. 

కొత్త పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల(Electric Scooters) సబ్సిడీని రూ.22,500 నుంచి రూ.10,000కు తగ్గించారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, ఈ-రిక్షాకు సబ్సిడీ రూ.25,000గా, బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండే ఎలక్ట్రిక్ త్రీవీలర్లకు రూ.50,000 సబ్సిడీగా నిర్ణయించారు.

Also Read: ప్రపంచ యుద్ధ భయం.. ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం.. మరి స్టాక్ మార్కెట్ పరిస్థితి..?

2023లో 15.3 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(Electric Scooters) డిమాండ్ - విక్రయాలు వేగంగా పెరిగాయి. ముఖ్యంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాల సెగ్మెంట్లలో మరింత వృద్ధి కనిపించింది. ఎలక్ట్రిక్ వాహనాల మొత్తం విక్రయాలు 2023లో 15.30 లక్షల యూనిట్లకు చేరుకోగా, అవి 2022లో 10.2 లక్షలుగా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం మూడవ దశ FAME 2 సబ్సిడీని ముందుకు తీసుకువెళితే, అది పరిశ్రమ వృద్ధికి సహాయపడుతుందని కంపెనీలు నమ్ముతున్నాయి.

2-3 సంవత్సరాలలో, పెట్రోల్ అలాగే  EV ద్విచక్ర వాహనాల(Electric Scooters) ధర సమానంగా ఉంటుందని
FADA ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా చెబుతున్నారు.  పెట్రోల్ టూ-వీలర్ తయారీదారులు ఇ-టూ-వీలర్ల మోడళ్లను కూడా పెంచుతున్నారు. ప్రస్తుతం వాటి వాటా దాదాపు 5% ఉంది. ఇది 2-3 సంవత్సరాలలో అనేక రెట్లు పెరుగుతుంది. పెట్రోల్ ద్విచక్ర వాహనాలకు దగ్గరగా ధరలు కూడా తగ్గవచ్చని చెబుతున్నారు. 

#automobile #electric-two-wheelers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe