Election Ink: ఓటు సిరాచుక్క.. హైదరాబాద్ తయారీయే.. ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అంటారు..

ఓటు వేసిన తరువాత అందరం గర్వంగా చూపించే ఎడమచేతి చూడువేలిపై ఉండే మార్క్ సిరా తయారయ్యేది మన దేశంలో రెండు చోట్లే. ఈ ఇంక్ కర్ణాటక, హైదరాబాద్ లో ఉత్పత్తి అవుతుంది. దీనిని మనతో పాటు ప్రపంచంలోని 100 దేశాలు ఉపయోగిస్తున్నాయి. 1962 నుంచి ఈ సిరాచుక్క విధానం అమలులో ఉంది. 

New Update
Election Ink: ఓటు సిరాచుక్క.. హైదరాబాద్ తయారీయే.. ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అంటారు..

Election Ink:  ఎలక్షన్స్ వచ్చాయి అంటే మనకు ఠక్కున గుర్తువచ్చేది సిరాచుక్క. ఓటు వేసిన వెంటనే వేలిపై సిరాచుక్కను గర్వంగా అందరికీ చూపించడం.. సిరాచుక్కతో ఉన్న వేలితో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఇప్పుడు అందరూ చేసే క్రేజీ పని. ఓటు వేశామని చెప్పడానికి సిరాచుక్కే ప్రూఫ్. ఓటు వేసేశారు అని అధికారులకు తెలియడానికి ఆ సిరాచుక్కే ఆధారం. దొంగ ఓట్లు పడకుండా నియంత్రించడం కోసం సిరాచుక్క ఒక పెద్ద ఆయుధం అధికారులకు. ఆ సిరా చుక్క ఒక పట్టాన పోదు. ఎన్నోరోజులు అది మన వేలిని అంటిపెట్టుకునే ఉంటుంది. అందుకే ఓటు వేయడానికి వెళ్లిన వారికి సిరాచుక్క వేస్తారు. మనకు ఈవీఎంల గురించి తెలుసు.. అవెలా పనిచేస్తాయో చాలాసార్లు మనం వినే ఉంటాం. కానీ.. ఈ ఓటు గుర్తు వేసే సిరా గురించి పెద్దగా తెలీదు. అసలు ఈ సిరా ఎక్కడ తయారు అవుతుంది? ఎందుకు ఇది తొందరగా చెరిగిపోదు? ఇలాంటి విషయాలు తెలుసుకుందామా?

సిరాచుక్క వేలిపై వేయడం కోసం సిరాను(Election Ink)ఉత్పత్తి చేయడం మొదటగా భారత్ లో 1962లో ప్రారంభించారు. భారత తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ ఈ సిరాను ఎన్నికల్లో చేర్చాలని సూచించడంతో ఈ నీలం రంగు సిరా 1962 ఎన్నికల్లో తొలిసారి ఉపయోగించారు. ఇందులో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ అనే కెమికల్ ఉంటుంది. అందువల్ల ఇది తొందరగా చెరిగిపోదు. మొదట్లో దీనిని ఎడమచేతి చూపుడు వేలుపై చుక్కలా వేశేవారు. (కుడి చేతి మీద వేస్తే సిల్వర్ నైట్రేట్ నోటిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది) తరువా 2006 నుంచి దీనిని ఎడమ చేతి చూపుడు వేలు గోటిపై నిలువుగా రాస్తున్నారు. 

ఇక ఈ ఇంక్ (Election Ink)భారతదేశంలో రెండే రెండు చోట్ల ఉత్పత్తి అవుతుంది. మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే ఓ కంపెనీలో మొదట ఇది తయారు అయ్యేది. తరువాత మన హైదరాబాద్ లోని రాయుడు లేబొరేటరీస్ లో కూడా తయారు చేయడం మొదలైంది. ఇప్పటికీ ఈ రెండు కంపెనీలే మన దేశంలోని అన్ని ఎన్నికలకు ఇంకు సప్లై చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి కదా.. అంటే జనరల్ ఎలక్షన్స్ మొదలుకొని.. పంచాయతీ ఎన్నికల వరకూ రకరకాల ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ఈ ఎన్నికలు అన్నిటికీ సిరా చుక్క తప్పనిసరి. (అన్ని ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించకపోవచ్చు.. కానీ సిరాచుక వేయడం మాత్రం తప్పదు) అందువల్ల ఈ రెండు కంపెనీలలో సిరా ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది. 

Also Read: ఓటు వేయడంపై అనుమానాలా? మీ ప్రతి డౌట్ కీ సమాధానం ఇక్కడ ఉంది!

ఇక మన దేశంలో తయారయ్యే ఈ ఇంకు(Election Ink) చాలా దేశాలు ఉపయోగిస్తాయి. ఇక్కడి నుంచి ఆయా దేశాలలకు నిత్యం ఎగుమతి అవుతూనే ఉంటుంది. భారతదేశంలోని ఎన్నికలకు మైసూర్ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌ ఇంకు ఎక్కువగా వాడుతారు. విదేశాలకు ఎగుమతి  చేసే సిరా మాత్రం ఎక్కువగా హైదరాబాద్ రాయుడు లాబొరేటరీస్ నుంచే అవుతుంది. మొత్తం 100 దేశాలు మన దేశపు ఇంకు  వాడుతున్నాయట. వాటిలో 29 దేశాలు హైదరాబాద్ నుంచే ఇంకు  దిగుమతి చేసుకుంటున్నాయి. ఇండియా, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా, బెనిన్, లిస్బెన్, మడగాస్కర్, నైజీరియా, మాలే, ఒమన్, మాల్దీవులు, వనౌతు, మోజాంబిక్, రువండా, జాంబియా, ఇథియోపియా, ఈస్టర్ తిమోర్ లాంటి దేశాలు వీటిలో ఉన్నాయి. ఇటీవల  క‌ర్ణాటకలోని మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌(ఎంపీవీఎల్‌) కాంబోడియా పార్లమెంట్ ఎలక్షన్ల కోసం పెద్ద ఎత్తున సిరా బాటిళ్లను రూపొందించి, పంపించడానికి ఏర్పాట్లు చేసింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో భారత్ లో ఈ రెండు కంపెనీల వద్ద ఉత్పత్తి అయ్యే సిరా క్వాలిటీపై నమ్మకం ఉంది. 

మొదట్లో సిరాను చిన్న బాటిల్స్ లో నింపి సప్లై చేసేవారు. తరువాత ఈ విధానం మారింది. ఇప్పుడు అంటే 2004 నుంచి ఇంక్ మార్కర్స్ తీసుకువచ్చారు. ఇప్పడు వీటినే వాడుతున్నారు. అందుకే గోరుపై నిలువుగా గీతలా పెడుతున్నారు. ఈ సారి తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల ఇంక్  సీసాలను సరఫరా చేస్తున్నారు. ఒక్కో సీసా సిరాను గరిష్టంగా 700 మందికి వేయవచ్చట. ఒక లీటర్ ఎన్నికల ఇంక్ ధర రూ.12,700 వరకు ఉంటుందట. 

అదండీ మనం ఓటేశామని గర్వంగా అందరికీ చూపించే సిరా చుక్క కథ. మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసి ..  ఎడమ చేతి చూపుడు వేలు గర్వంగా పైకెత్తి చూపిద్దాం.. మేము ఓటేశాము.. మరి మీరో అంటూ.. మీరు అందుకు రెడీ కదా!

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు