EC: రేపు మధ్యాహ్నం 3గంటలకు లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటన!

రేపు మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. రేపు ఆఫ్టర్‌నూన్‌ సీఈసీ ప్రెస్‌మీట్‌ పెట్టనుంది. ఈ ప్రెస్‌మీట్‌ అన్ని సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో లైవ్‌స్ట్రీమింగ్‌ అవ్వనుంది.

EC: రేపు మధ్యాహ్నం 3గంటలకు లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటన!
New Update

Lok Sabha Election 2024 Schedule: రేపు మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. రేపు ఆఫ్టర్‌నూన్‌ సీఈసీ ప్రెస్‌మీట్‌ పెట్టనుంది. ఈ ప్రెస్‌మీట్‌ అన్ని సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో లైవ్‌స్ట్రీమింగ్‌ అవ్వనుంది. ప్రతి రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై జాతీయ సర్వేను పూర్తి చేసిన ఈసీ తాజాగా జమ్ముకశ్మీర్ పర్యటనతో తన సర్వేను ముగించింది. 543 లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించాయి. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) కు సంబంధించి బీజేపీ ఇప్పటివరకు 267 మంది అభ్యర్థులతో రెండు జాబితాలను విడుదల చేయగా, కాంగ్రెస్ రెండు జాబితాల్లో 82 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక తాజాగా ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సంధు బాధ్యతలు స్వీకరించారు.

publive-image



Also Read: సరిగ్గా ఆ ప్రాజెక్ట్‌ డీల్‌కు ముందే రూ.140 కోట్ల ఎలక్టోరల్ బాండ్‌ను కొనుగోలు చేసిన మేఘ!

#lok-sabha-election-schedule
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe