Mobile:  చార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతున్నారా.. ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు..!

కొంత మంది ఫోన్స్ చార్జింగ్ పెట్టి వాడుతుంటారు. ఇలా చేస్తే మొబైల్స్ పాడయ్యే ప్రమాదం ఎక్కువ. అధిక ఉష్ణోగ్రతల కారణంగా బ్యాటరీ లైఫ్ స్పాన్ తగ్గడంతో పాటు త్వరగా పాడవడానికి కారణమవుతుంది. అందుకే చార్జింగ్ పెట్టి మొబైల్ వాడడం సురక్షితం కాదు.

New Update
Mobile:  చార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతున్నారా.. ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు..!

Using When Charged Phones:  ఈ మధ్య కాలం అందరు 24 గంటలు ఫోన్స్ చూస్తూ బిజీగా గడిపేస్తున్నారు. కొంత మంది ఎంటర్ టైన్మెంట్ కోసం ఉపయోగిస్తే మరి కొంత మంది నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగించే వాళ్ళు ఉంటారు. ఏదేమైన ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ చేతిలోనే ఉండడం తప్పనిసరి అయిపొయింది చాలా మందికి. కొన్ని సార్లు అయితే ఫోన్స్ చార్జింగ్ పెట్టి మరీ వాడుతుంటారు. ఈ విషయాన్నీ చాలా మంది సింపుల్ గా తీసుకుంటారు. కానీ ఇలా చేస్తే మనిషితో పాటు మనం వాడే పరికరాలకు కూడా నష్టం కలుగుతుంది. అసలు చార్జింగ్ పెట్టి మొబైల్ వాడితే నష్టాలేంటో తెలుసుకోండి..

అధిక ఉష్ణోగ్రత

మొబైల్ చార్జింగ్ లో ఉన్నప్పుడు వాడడం వల్ల ఫోన్ టెంపరేచర్ మరింత పెరిగేలా చేస్తుంది. సహజంగా ఫోన్స్ లో లిథియం ఐయాన్ బ్యాటరీస్ వాడతారు. ఇవి వేడికి చాలా సున్నితంగా ఉంటాయి. కావున ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు బ్యాటరీ దెబ్బతిని త్వరగా పాడవడానికి కారణమవుతుంది .

బ్యాటరీ నాణ్యత తగ్గిపోతుంది

సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు, ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం మొబైల్ బ్యాటరీ నాణ్యత క్షీణించడానికి దారి తీస్తుంది. మొబైల్ చార్జింగ్ లో ఉన్నప్పుడు ఎక్కువగా వాడడం బ్యాటరీ లైఫ్ స్పాన్ పై ప్రభావం చూపుతుంది. అందుకే చార్జ్ లో ఉండగా వాడకూడదని హెచ్చరిస్తారు.

Also Read: Carrot Lemon Rice: పిల్లల కోసం హెల్తీ క్యారెట్ లెమన్ రైస్.. ట్రై చేయండి.. అదిరిపోతుంది

publive-image

స్పీడ్ ఛార్జింగ్

కొంత మంది యూజర్స్ ఫాస్ట్ టెక్నాలజీ చార్జింగ్ పరికరాలు వాడతారు. ఇవి వాడే వారు మొబైల్ చార్జింగ్ లో ఉన్నప్పుడు ఎక్కువగా వాడితే మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. నార్మల్ చార్జర్స్ కంటే స్పీడ్ చార్జర్స్ ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి. దీని ఉష్ణోగ్రత ఎక్కువై ఫోన్ బ్యాటరీస్ దెబ్బతింటాయి.

సేఫ్టీ ఫీచర్స్

మాడ్రన్ టెక్నాలజీస్ తో తయారైన మొబైల్స్ లో సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవి ఫోన్ వాడేటప్పుడు, ఛార్జింగ్ సమయంలో అధిక వేడిని నిర్వహించడానికి సహాయపడతాయి. ఈ సేఫ్టీ ఫెచర్స్ ఫోన్ బ్యాటరీ లైఫ్ ను రక్షిస్తాయి. అయినా సరే ఎక్కువ రోజుల పాటు ఇలా చేస్తే బ్యాటరీ ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.

Also Read: Kitchen Tips: మీ ఫ్రిడ్జ్ లో ఐస్ పేరుకుపోతుందా.. దానికి కారణమేంటో తెలుసా

Advertisment
తాజా కథనాలు