Health tips: అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చోని వర్క్ చేస్తున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు..! గంటలు తరబడి స్క్రీన్ ముందే ఉండటం వల్ల కళ్ళతో పాటు శరీరంలో కూడా చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. తలనొప్పి, నడుము నొప్పి, కంటి చూపు తగ్గిపోవడం, కంటి సంబంధిత వ్యాధులకు గురవ్వడం జరుగుతుంది. వీటి నుంచి దూరంగా ఉండటానికి ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. By Archana 10 Oct 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Health tips: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్ది, మనిషి జీవితంలో బిజీ బిజీగా అయిపోతున్నాడు. 24 గంటలు కంప్యూటర్ ముందు కూర్చొని తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. రోజులో ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్(computer Screen) ముందే ఉండటం వల్ల కంటి చూపు పై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. గంటలు తరబడి స్క్రీన్ ముందే ఉండటం వల్ల కళ్ళతో పాటు శరీరంలో కూడా చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. తలనొప్పి, నడుము నొప్పి, కంటి చూపు తగ్గిపోవడం, కంటి సంబంధిత వ్యాధులకు గురవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్(Occupational Asthenopia) సమస్య ఎక్కువగా ఆఫీస్ లో కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసే వాళ్లలో కనిపిస్తాయి. ఈ వ్యాధికి సంబందించిన లక్షణాలు కళ్ళు పొడి బారడం, కాంతిని తట్టుకోలేకపోవడం, కళ్ళు మసకబారడం, కళ్ళుల్లో చికాకు పుట్టడం, తలనొప్పి, మెడనొప్పి, నడుమునొప్పి, ఏదైనా వస్తువు రెండుగా కనిపించడం వంటి లక్షణాలతో బాధపడతారు. ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ కేవలం కంప్యుటర్ ముందు కూర్చుంటే మాత్రమే కాదు పని చేసే ప్రదేశాల్లో సరైన లైటింగ్, వెలుతురు లేకపోవడం, అలాగే కూర్చునే భంగిమలు కూడా ప్రభావితం చేస్తాయి. పని చేసే ప్రదేశాల్లో ఈ టిప్స్ పాటిస్తే ఈ సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. సరైన కాంతి ఉన్న ప్రదేశాల్లో మీ కంప్యూటర్ ఉండేలా చూసుకోండి. దాని వల్ల కంటి పై ఎక్కువగా శ్రమ పడకుండా ఉంటుంది. సహజ కాంతిని(Natural light) అంటే బయట నుంచి వచ్చే వెలుతురు మన మానిటర్ కు 90 డిగ్రీల దూరంలో వచ్చేలా చూసుకోవాలి. కంప్యూటర్(Computer) స్క్రీన్ నుంచి వచ్చే కాంతి నేరుగా కళ్ళలో పడకుండా, మానిటర్ ను ఫ్లోరోసెంట్ లైట్ కింద ఉంచాలి. దాంతో స్క్రీన్ నుంచి వచ్చే లైట్ కంటి చూపుకు సమస్య కాకుండా ఉంటుంది. స్క్రీన్ పై కనిపించే అక్షరాలు ఉండాల్సిన దాని కంటే కాస్త పెద్దది గా ఉండేలా చూడాలి. చిన్న చిన్న అక్షరాల వల్ల కంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పని చేసేటప్పుడు మన మానిటర్ మన నుదురు భాగానికి సమానంగా ఉండేలా చూసుకోవాలి. స్క్రీన్ 1-2 అంగుళాల కిందకి ఉంచాలి దాని వల్ల మెడ నొప్పి సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అలాగే గంటలు తరబడి స్క్రీన్ ముందు కూర్చోకుండా మధ్య మధ్యలో కాస్త గ్యాప్ ఇవ్వాలి దాని వల్ల కంటికి కాస్త శ్రమ తగ్గుతుంది. పని చేసే పరిసరాలు కూడా కంటి చూపును ప్రభావితం చేస్తాయి. సరైన వెలుతురు, లైటింగ్ లేకుంటే కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కావున పని చేసే పరిసరాల్లో సరైన లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. Also Read: One Sided Love: వన్ సైడ్ లవ్‌లో ఉన్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి.. ఏం అవుతుందో చూడండి! #sitting-before-computer #effects-of-sitting-infront-of-computer #effects-of-watching-computer #spending-more-hours-on-computer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి