Eating Banana on Empty Stomach: అరటి పండు లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, B6, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలకు ఇది సరైన ఎంపిక. బననా కేవలం తినడానికి మాత్రమే కాదు దీంతో డిఫరెంట్ వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. స్మూతీస్, పాన్ కేక్స్ ఇలా రకరకాల టేస్టీ వంటకాలు చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం రోజూ తినే ఆహారంలో బననా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ ఫ్రూట్ ఖాళీ కడుపుతో తీసుకుంటే మాత్రమే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎంప్టీ స్టమక్ తో అరటి పండు తింటే ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకోండి..
ఎంప్టీ స్టమక్ తో అరటి పండు తింటే కలిగే సమస్యలు
గుండెకు ఆరోగ్యానికి మంచిది కాదు
సాధారణంగా అరటి పండులో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో ఇది తిన్నప్పుడు బననాలోని అధిక మెగ్నీషియం కారణంగా.. శరీరంలో క్యాల్షియం, మెగ్నీషియం సమతుల్యతల పై ప్రభావం చూపుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంటుంది.
రక్తంలో చక్కర స్థాయిలను పెంచుతుంది
బననాలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎంప్టీ స్టమక్ తో తిన్నప్పుడు రక్తంలో చక్కర స్థాయిలు పెరగడానికి కారణమవుతుంది. ఇది నీరసం, తల నొప్పి, ఇతర సమస్యలకు దారి తీస్తుంది. అందుకే ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఉదయాన్నే ఈ పండు తినకూడదని నిపుణుల సలహా.
Also Read: Tea In Paper Cups: పేపర్ కప్పులో టీ తాగితే ఇంత ప్రమాదమా..! అస్సలు లైట్ తీసుకోకండి
స్టమక్ అప్సెట్
అరటి పండులో పెక్టిన్ అనే ఒక ఫైబర్ ఉంటుంది. ఖాళీ కడుపుతో ఇది తిన్నప్పుడు.. పొట్టలోని యాసిడ్స్.. ఈ ఫైబర్ తో కలిసిపోయి జీర్ణక్రియ పని తీరును నెమ్మది చేస్తుంది. దీని వల్ల కడుపు ఉబ్బినట్లు, అసౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
అసిడిటీ
ఆల్రెడీ అరటిపండు అసిడిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఖాళీ కడుపుతో దీన్ని తింటే.. దీన్ని తీవ్రత మరింత పెరిగే ప్రభావం ఉంటుంది. ఇవి తిన్న వెంటనే ఇన్స్టాన్ట్ ఎనర్జీ ఇస్తాయి. కానీ తరువాత అలిసిపోనట్లుగా అనిపించే ఫీలింగ్ కలిగిస్తుంది.
ఐరన్ శోషణ తగ్గిపోతుంది
బననా లో అధికంగా ఉండే పొటాషియం శరీరంలో ఐరన్ శోషణకు భంగం కలిగిస్తుంది. ముఖ్యంగా ఐరన్ లోపం ఉన్నవారిలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో కాకుండ .. ఏదైనా మీల్ తీసుకున్న తరువాత వీటిని తింటే మంచి ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Worst Foods: ప్రపంచంలో టాప్-10 చెత్త ఫుడ్ ఐటెమ్స్.. లిస్ట్‌లో భారతీయ వంటకాలు కూడా!