Tea In Paper Cups: అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ ఐమార్క్ గ్రూప్ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, రెడీ టూ ఈట్ ఫుడ్స్ వినియోగం కోసం 2019 లో దాదాపు 264 బిలియన్ పేపర్ కప్పులు ఉత్పత్తి అయినట్లు చెబుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కూడా వీటి వినియోగం బాగా పెరిగింది. సింపుల్ అండ్ ఈజీ గా వాడచ్చు.. అంతే కాదు వీటిని క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదని భావిస్తారు. కానీ వీటిని మరీ ఎక్కువ వాడితే ఆరోగ్యానికి హానికరం.
పేపర్ కప్స్ ఆరోగ్యానికి హానికరం
ఇటీవలే ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం వాతావరణంలో ప్లాస్టిక్ ఎంత విషపూరిత ప్రభావం చూపుతుందో పేపర్ కప్స్ కూడా అంతే ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నాయి. ఎందుకంటే పేపర్ కప్స్ వేడి ద్రవాలు లేదా ఏవైన పానీయాలు పోసినప్పుడు వాటిని పేపర్ పీల్చకుండ కప్పులో హైడ్రోఫోబిక్ ఫిలిం అనే పల్చని పోర ఉంటుంది. ఈ ప్లాస్టిక్ పొర విషపూరితమైన కెమికల్స్ విడుదల చేస్తుంది. సాధారణంగా ఒక మనిషి ఈ పేపర్ కప్ లో రోజుకు 3 సార్లు టీ తాగితే.. కంటికి కనిపించని 75,000 చిన్న మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి వెళ్తాయని పరిశోధనలు పేర్కొన్నాయి.
Also Read: Mental Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ మానసిక ఆరోగ్యం బాగాలేదని సూచన..!
పేపర్ కప్స్ లో టీ తాగితే ఏమవుతుంది
వేడి వేడి పానీయాలు పోసినప్పుడు కప్పులో ఉన్న ప్లాస్టిక్ లేయర్ కరిగిపోయి.. టీతో పాటు కడుపులోకి చేరుతుంది. దాని వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఊబకాయం, ఫెర్టిలిటీ, పిల్లల్లో డెవలెప్మెంట్ డిలేస్, భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉండొచ్చని పరిశోధకుల అంచనా. కావున వీలైనంత వరకు పేపర్, ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తే మంచింది. స్టీల్ లేదా గాజు గ్లాస్ బెటర్ ఛాయిస్. తప్పని పరిస్థితుల్లో కాకుండా .. మిగతా సమయాల్లో కూడా పదే పదే వీటిని వాడితే ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది.
Also Read: Prawns: రొయ్యలు అంటే ఇష్టమా..? అయితే ఇవి తప్పక తెలుసుకోండి