Anant-Radhika Education: అంబానీ ఫ్యామిలీ పేరు ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, కొన్నిరోజుల్లో రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహిస్తున్నారు.అంబానీ ఫ్యామిలీకి కాబోయే కోడలు రాధికా మర్చంట్ గురించి తెలుసుకునే నెటిజన్లు గూగుల్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ కథనంలో అంబానీ కాబోయే కోడలు రాధిక మర్చంట్, కొడుకు అనంత్ ఏం చదువుకున్నారు..ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.
రాధిక మర్చంట్ ఎంత చదువుకున్నారో తెలుసా?
అనంత్ అంబానీ కాబోయే భార్య రాధిక మర్చంట్ బి-టౌన్ నటి కంటే తక్కువేం కాదు. రాధిక ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవో వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్‌ల చిన్న కుమార్తె. E టైమ్స్ నివేదిక ప్రకారం, రాధిక మర్చంట్ తన పాఠశాల విద్యను కేథడ్రల్ జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియాల్ వరల్డ్ స్కూల్, ముంబైలోని BD సోమని ఇంటర్నేషనల్ స్కూల్ నుండి పూర్తి చేసింది.దీని తరువాత, ఆమె గ్రాడ్యుయేషన్ డిగ్రీని అభ్యసించడానికి న్యూయార్క్ వెళ్లి 2017లో న్యూయార్క్ యూనివర్శిటీ నుండి పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీతో తిరిగి వచ్చింది.
వ్యాపారవేత్తగా గుర్తింపు:
రాధికా మర్చంట్ వ్యాపార మహిళగా పేరుగాంచింది. గ్రాడ్యుయేషన్ తర్వాత, రాధిక మర్చంట్ ఇస్ప్రవా అనే లగ్జరీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సుమారు ఒక సంవత్సరం పాటు పనిచేసింది. ఆమె ఈ కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. వ్యాపార ప్రపంచంలో రాధిక ప్రయాణం ఇంతటికే పరిమితం కాలేదు.తర్వాత ఆమె తన కుటుంబ వ్యాపార సంస్థ అయిన ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌లో చేరి తన తండ్రికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. పౌర హక్కులు, జంతు సంరక్షణ, విద్య, ఆరోగ్యం, ఆర్థిక సాధికారత, మానవ హక్కులు సామాజిక సేవ రంగాలపై కూడా రాధిక చాలా ఆసక్తిని కలిగి ఉంది.
అనంత్ ఈ డిగ్రీ చేశాడు:
ముఖేష్ అంబానీ ముద్దులకొడుకు అనంత్ ముంబైలోని ధీరూభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి పాఠశాల విద్యను అభ్యసించాడు. ICSE బోర్డుకి అనుబంధంగా ఉన్న ఈ పాఠశాల నుండి అనంత్ తన ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. దీని తరువాత అతను తదుపరి చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ నుండి బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ 2022 చివరిలో నిశ్చితార్థం చేసుకున్నారు . ఈ జంట పెళ్లి కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మార్చి 1 నుండి మార్చి 3 వరకు, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని వారి పూర్వీకుల జోగ్వాడ్ గ్రామంలో వారి ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్ నిర్వహించబడుతోంది.
ఇది కూడా చదవండి: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ మైఖేల్ జాన్స్ కన్నుమూత..!!