Brightcom : బ్రైట్ కాం సంస్థల్లో ముగిసిన ఈడీ సోదాలు..868 కోట్ల అక్రమ లావాదేవీలు! గత మూడు రోజులుగా హైదరాబాద్ బ్రైట్ కాం సంస్థల్లో నిర్వహించిన ఈడీ సోదాలు ముగిశాయి. అయితే ఈ సోదాల్లో భారీగా అక్రమలావాదేవీలు బయటపడ్డాయి. బ్రైట్ కాం సంస్థ సెబీలో అనధికారిక లావాదేవీలతో ట్రేడింగ్ చేసినట్లు ఈడీ అధికారులు సోదాల్లో తేల్చారు. ఈ క్రమంలో దాదాపుగా 868 కోట్ల అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. By P. Sonika Chandra 26 Aug 2023 in క్రైం హైదరాబాద్ New Update షేర్ చేయండి ED raids Brightcom Group in Hyderabad:గత మూడు రోజులుగా హైదరాబాద్ బ్రైట్ కాం సంస్థల్లో నిర్వహించిన ఈడీ సోదాలు ముగిశాయి. అయితే ఈ సోదాల్లో భారీగా అక్రమలావాదేవీలు బయటపడ్డాయి. బ్రైట్ కాం సంస్థ సెబీలో అనధికారిక లావాదేవీలతో ట్రేడింగ్ చేసినట్లు ఈడీ అధికారులు సోదాల్లో తేల్చారు. ఈ క్రమంలో దాదాపుగా 868 కోట్ల అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. ఇక ఈ సోదాల్లో భాగంగా ఈడీ అధికారులు 9.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు 3.50 కోట్ల క్యాష్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే బ్రైట్ కాం సంస్థ సీఏ మురళీ మోహన్ ఇంటి నుంచి ఈడీ అధికారులు ఇంత భారీ మొత్తంలో నగదు, నగలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. సెబీ ఫిర్యాదుతోనే రంగంలోకి ఈడీ..! కాగా, సెబి (SEBI) ఫిర్యాదుతోనే బ్రైట్ కామ్ గ్రూప్ కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. డైరెక్టర్ మురళీ మోహన్ ఇంట్లో 3 కోట్లకు పైగా నగదును సీజ్ చేయడం జరిగింది. అదే విధంగా సురేష్ కుమార్ రెడ్డి, నరేష్ ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే బ్రైట్ కాం సంస్థ స్టాక్ ఎక్చ్సేంజ్ లో అనధికారికంగా అమ్మకాలు, కొనుగోళ్ళ లావాదేవీలు జరిపినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. Also Read: జియో 5G, జియో ఎయిర్‌ఫైబర్, జియో స్మార్ట్‌ఫోన్.. అంబానీ ఏం చెప్పబోతున్నారు? #ed-raids-brightcom-group-in-hyderabad #brightcom-group #ed-searches-brightcom-group-offices #ed-conducts-searches-at-brightcom-group మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి