Seed Health: ఈ గింజలతో ఇంత ఆరోగ్యమా.. అవేంటో తెలుసుకోండి

 శరీరానికి అవసరమైన పోషకాలు,ఆరోగ్యం కావాలంటే ఆకుకూరలు, కూరగాయలు మాత్రమే కాదు ఈ గింజలను కూడా ఆహారంలో తీసుకోవాలి. చియా సీడ్స్, సజ్జ సీడ్స్, గుమ్మడికాయ సీడ్స్, అవిసె గింజలు, నువ్వులు ఆహారంలో చేర్చాలి. ఇవి జీర్ణక్రియ, గుండె, రక్తహీనత, మధుమేహం సమస్యలను దూరం చేస్తాయి.

New Update
Seed Health: ఈ గింజలతో ఇంత ఆరోగ్యమా.. అవేంటో తెలుసుకోండి

Seed Health: ఆరోగ్యంగా, దృఢంగా ఉండడానికి మన రోజూ ఆహారంలో సహజంగా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు తింటాము. ఇవి శరీరానికి కావల్సిన విటమిన్స్, మినరల్స్, పోషకాలను అందిస్తాయి. కానీ వీటిని మాత్రమే తింటే సరిపోదు.. మరింత పౌష్టికాహారం కోసం కొన్ని హెల్తీ సీడ్స్ కూడా మీ డైట్ లో తీసుకోవాలి. ఏ సీడ్స్ తినాలి.. వాటి ప్రయోజనాలు ఏంటో ఎప్పుడు తెలుసుకోండి..

హెల్తీ సీడ్స్ వాటి ప్రయోజనాలు

సబ్జా సీడ్స్

సబ్జా విత్తనాలలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఇవి కార్బహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్ సమాన మోతాదులో కలిగి ఉంటాయి. అలాగే ఐరన్, క్యాల్షియం, నియాసిన్, విటమిన్ B6 వంటి పోషకాలు ఎక్కువ. ఇవి జీర్ణక్రియ, బరువు తగ్గడంలో సహాయపడతాయి. అలాగే మెరుగైన చర్మానికి తోడ్పడతాయి.

చియా సీడ్స్

వీటిలో ఫైబర్, యాంటి ఆక్సిడెంట్స్, మినరల్స్ తో పాటు గుండె ఆరోగ్యం పై మంచి ప్రభావం చూపే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. రోజూ తినే ఆహారంలో వీటిని తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహ సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే ఎముకల దృఢత్వాన్ని కూడా సహాయపడతాయి.

సన్ ఫ్లవర్ గింజలు

రోజూ తినే ఆహారంలో నువ్వుల గింజలు తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల పై మంచి ప్రభావం చూపుతాయి. ఇవి అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు , కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడాన్ని తగ్గిస్తాయి.

గుమ్మడి కాయ గింజలు

గుమ్మడికాయ గింజల్లో విటమిన్స్, మాంగనీస్, విటమిన్ K గాయాలను తగ్గించడంలో సహాయపడును. అలాగే వీటిలోని జింక్, యాంటి ఆక్సిడెంట్స్ రోగ నిరోధశక్తిని పెంచి.. బ్యాక్టీరియా, వైరస్ నుంచి కాపాడును. అంతే కాదు గుమ్మడి కాయ గింజలు యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా పని చేస్తాయి.

నువ్వుల గింజలు

రక్తహీనత, బలహీనత సమస్యలతో బాధపడేవారు రోజూ తినే ఆహారంలో నువ్వు గింజలు తీసుకుంటే ఆరోగ్యం పై మంచి ప్రభావం చూపుతాయి. వీటితో తయారు చేసిన బెల్లం లడ్డూలు తినడం రక్తహీనత ఉన్న వారికి మంచి చిట్కా

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Sun Screen: సన్‌స్క్రీన్ ఇన్ని సమస్యలు దూరమా.. తప్పక తెలుసుకోండి..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు