High Temperature in August :65 దేశాల్లో ఆగస్టులో అత్యధిక ఉష్ణోగ్రతలు!

ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు(High Temperature) గత కొన్ని నెలలుగా పెరుగుతునే ఉన్నాయి. సుమారు 65 దేశాల్లో(65 Countries) ఆగస్టులో మాత్రమే 13 శాతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అయితే ఇది 1951 నుంచి 1980 నుంచి పోల్చితే ఇప్పటి వరకు కేవలం ఈ ఏడాది ఆగస్టు నెలలో మాత్రమే ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదు అయ్యింది.

New Update
TS News : తెలంగాణ వాసులకు అలెర్ట్...ఏప్రిల్ 1 నుంచి జాగ్రత్తగా ఉండాలన్న ఐఎండీ..!

65 countries Experienced Record High Temperatures in August: ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు(High Temperature) గత కొన్ని నెలలుగా పెరుగుతునే ఉన్నాయి. సుమారు 65 దేశాల్లో  ఆగస్టులో మాత్రమే 13 శాతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అయితే ఇది 1951 నుంచి 1980 నుంచి పోల్చితే ఇప్పటి వరకు కేవలం ఈ ఏడాది ఆగస్టు నెలలో మాత్రమే ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదు అయ్యింది.

అమెరికాలో ఓ సంస్థ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం..ఆగస్టులో భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలో అత్యధికంగా పెరుగుదల కనిపించిందని సర్వే నివేదికలు తెలిపాయి. భారతదేశం, జపాన్‌, ఉత్తర అట్లాంటిక్‌, తూర్పు ఈక్వటోరియల్‌ పసిఫిక్‌, ఉత్తరాన కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా 174 ఏళ్ల నాటి వాతావరణ రికార్డులో ఈ ఏడాది ఆగస్టు నెల అత్యంత వేడిగా ఉందని సర్వే తెలిపింది.

రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరగడం అనేది ప్రపంచానికి పెద్ద ముప్పుగా పరిగణించబడుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా హిమాలయాలు, ఇతర మంచు పర్వతాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో సముద్ర మట్టాలు పెరిగే అవకాశం భారీగా ఉంది.

ఈ ఏడాది ఆగస్టు నెలలో జపాన్‌, ఉత్తర అట్లాంటిక్‌, ఉత్తర దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర వేడిని అనుభవించారు. అయితే 2023 ఆగస్టు కంటే కూడా 2016 ఆగస్టు నెలనే వెచ్చగా అనిపించింది. ఈ కాలంలో 0.31 డిగ్రీల సెల్సియస్‌ డిఫరెంట్‌ కనిపించడం అనేది విశేషం.

Advertisment
Advertisment
తాజా కథనాలు