Dussehra 2023: ఈ పండుగలతో ఎన్నో లాభాలు.. మన దేశ గొప్పతనం ఇదే!

దసరా, దీపావళి, ఈద్, క్రిస్మస్‌తో పాటు దేశంలో జరిగే ఏ ఇతర పండుగలతోనైనా చాలా మంచి జరుగుతుంది. ఏడాదికి ఒకసారైనా కుటుంబసభ్యులు, స్నేహితులను కలుసుకునే టైమ్ ఇదే కావడంతో మన బంధాలు బలోపేతం అవుతాయి. అటు చిన్న చిన్న వ్యాపారస్తులు కాస్త ఆర్థికంగా వృద్ధి చెందుతారు

New Update
Dussehra 2023: ఈ పండుగలతో ఎన్నో లాభాలు.. మన దేశ గొప్పతనం ఇదే!

ఇండియా భిన్నమతాలకు, అనేక సంస్కృతులకు నిలయం. ఇక్కడ ఏ పండుగ వచ్చినా అంతా కలిసిపోతారు. ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉంటారు. ప్రపంచంలో ఎక్కువగా పండుగలు జరుపుకొనే దేశాల్లో ఇండియా మొదటిస్థానంలో ఉంది. పండుగలు వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. కేవలం మతానికి సంబంధించిన పండుగ విశిష్టత తెలుసుకోవడమే కాదు సామాజీక విషయాలను కూడా తెలుసుకుంటే పండుగల గొప్పతనం తెలుస్తుంది.

◘ ఐక్యత: ఇండియా అంటేనే ఐక్యత. ఇది ప్రపంచం మొత్తం తెలుసు. ప్రస్తుతం జరుగుతున్న దసరా పండుగను చేసినా ఈ విషయం అర్థమవుతుంది. దీపావళి, ఈద్, క్రిస్మస్‌తో పాటు ఇతర పండుగలు విభిన్న వర్గాల మధ్య ఐక్యతను పెంచుతుంది. వివిధ మతాలకు చెందిన ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తాయి.

◘ టూరిజం: ఫెస్టివల్స్‌ టైమ్‌లో టూరిజం పెరుగుతుంది. వివిధ దేశాల నుంచి మన దేశానికి వచ్చిన వారు ఇక్కడ జరుగుతున్న ఫెస్టివల్స్‌ను చూసి ఎంతో ఆశ్చర్యపోతారు. ఇది ప్రపంచ స్థాయిలో కల్చలర్‌ ఛేంజస్‌కు దారితీస్తుంది. దీని వల్ల మన దేశ గొప్పతనం ప్రపంచం నలుమూలలకు వ్యాపిస్తుంది.

◘ సామాజిక కారణాలు: సామాజిక సమస్యలపై అవగాహన పెంచడానికి పండుగలు ఉపయోగపడతాయి. పండుగ సమయల్లో నాటకాలు, పాటలు ప్రత్యేకంగా ఉంటాయి. వీటి ద్వారా మంచి మెసేజ్ ఇస్తారు. సవాళ్లతో పోరాడడంలో ఐక్యతను పెంపొందించడానికి
పండుగలు వేదికలుగా మారుతుంటాయి. ఈ పండుగల సమయాల్లో కుల, మత భేదాలను పక్కన పెట్టి ప్రజలు కలిసిపోతారు.

◘ స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం లాంటి పండుగలు జాతీయ ఐక్యతతో పాటు దేశభక్తిని సూచిస్తాయి. మొత్తం దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తాయి. మతపరమైన పండగులకే కాదు..జాతీయ పండుగలకు కూడా మన దేశం అన్నిటికంటే ఎక్కువ విలువను ఇస్తుంది.

◘ చారిత్రక ప్రాముఖ్యత: ప్రసిద్ధ పండుగల వెనుక ఉన్న చారిత్రక మూలాలు తెలుసుకోవడానికి ఈ ఫెస్టివల్స్‌ ఉపయోగపడతాయి. మనల్ని చరిత్ర కథనాల్లోకి ప్రవేశించేలా చేస్తాయి. సాంస్కృతిక వారసత్వంతో కనెక్ట్ అవ్వడానికి ఈ వేడుకలు సహాయపడతాయి. అంటే మనం ఎక్కడ నుంచి వచ్చాం.. ఈ పండుగ ఎందుకు చేసుకుంటున్నామో తెలుస్తుంది.

రిలేషన్స్‌: పండుగలు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఒకచోట చేర్చుతాయి. పండుగలు వస్తే అందరూ తమ సొంతూళ్లకు వెళ్లిపోతారు. ఆఫీస్‌, స్కూల్స్‌, కాలేజీలు పక్కన పెట్టి సరదగా గడుపుతారు. ఏడాదిలో ఇలా ఒక్కసారైనా చేయడం వల్ల మనకి కుటంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో ఉన్న బంధాలు బలోపేతం అవుతాయి.

సాంస్కృతిక వైవిధ్యం: దేశవ్యాప్తంగా జరుపుకునే అనేక పండుగల్లో ప్రతి ఒక్క దానికి ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది. ఇలా మనలో మన మధ్య ఉంటున్న ఇతర ప్రజల సంప్రదాయాలు మనకు తెలుస్తాయి.. వాటిని గౌరవించడం.. వారితో కలిసిపోవడాన్ని పండుగలు ఉపయోగపడతాయి.

◘ ఆర్థిక ప్రభావం: వాణిజ్యం, పర్యాటకం పండుగ సీజన్లలో పీక్స్‌కు వెళ్తుంది.అటు చిన్న వ్యాపారాల వృద్ది కూడా ఉంటుంది. పండుగ చేసుకోవడం కోసం మన కొనుగోలు చేసే చిన్నచిన్న వస్తువులు ఎక్కువగా రోడ్‌ సైడ్‌ బండి పెట్టినవారివే ఉంటాయి. మనకు తెలియకుండానే వారికి మనం ఎంతో మేలు చేస్తుంటాం. ఇలా దేశవ్యాప్తంగా కేవలం పండుగల సీజన్‌లోనే చిన్న వ్యాపారస్తులు కాస్త లాభం తెచ్చుకుంటారు. ఆ డబ్బు వారి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని మర్చిపోకండి.

Also Read: నిమ్మకాయను ఇలా వాడుతున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే షాక్‌ అవుతారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు