Dussehra 2023:ఈ ఏడాది దసరా పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? 23న లేక 24న? ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష దశమి తిథి ఈ సారి రెండు రోజుల్లో కలిపి వచ్చింది. సోమవారం సాయంత్రం 5.44 నిమిషాలకు ప్రారంభమై..అక్టోబర్ 24 మంగళవారం మధ్యాహ్నం 3.14 గంటలకు ముగుస్తుంది. అందు వల్ల శ్రవణ యోగం ఉన్న సోమవారం నాడే పండుగ జరుపుకోవాలని పండితులు తెలుపుతున్నారు. By Bhavana 22 Oct 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Dussehra 2023: ఈ ఏడాది అధిక మాసం రావడం వల్ల అన్ని పండుగలు కూడా రెండు రోజులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇంతకు ముందు జరుపుకున్న పండుగలు అయిన వినాయక చవితి, రాఖీ కూడా రెండు రోజులు వచ్చాయి. దీంతో వేద పండితులు చెప్పిన రోజునే నిర్వహించుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే అతి పెద్ద పండుగ అయినటు వంటి దసరా ఎప్పుడూ జరుపుకోవాలి అనే మీద సందేహాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే విజయవాడ దుర్గ గుడి పండితులు దసరా అనేది శ్రవణ యోగం పూర్తిగా ఉన్న రోజునే జరుపుకోవాలని సూచించారు. అంటే శ్రవణ యోగం సోమవారం నాడు మాత్రమే పూర్తిగా ఉన్నందున విజయ దశమిని సోమవారం నాడే నిర్వహించాలని పండితులు సూచిస్తున్నారు. Also Read: రోజూ చన్నీళ్లతో స్నానం చేస్తే ఆర్యోగానికి ఎన్ని ప్రయోజనాలు తెలుసా? వైదిక క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష దశమి తిథి ఈ సారి రెండు రోజుల్లో కలిపి వచ్చింది. సోమవారం సాయంత్రం 5.44 నిమిషాలకు ప్రారంభమై..అక్టోబర్ 24 మంగళవారం మధ్యాహ్నం 3.14 గంటలకు ముగుస్తుంది. అందు వల్ల శ్రవణ యోగం ఉన్న సోమవారం నాడే పండుగ జరుపుకోవాలని పండితులు తెలుపుతున్నారు. 23 న కానీ, 24 న కానీ ఏ రోజు కూడా దశమి తిథి పూర్తిగా లేనందు వల్లే శ్రవణ యోగం ఉన్న రోజునే పండుగ నిర్వహించుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు. అందుకే సోమవారం శ్రవణయోగంలో మహర్నవమి, విజయ దశమి రెండింటిని జరుపుకుంటే మంచిదని శృంగేరీ పీఠాధిపతులు కూడా చెబుతున్నారు. అందుకే ఇప్పటికే తెలంగాణలో 23 వ తేదీనే విజయ దశమి పర్వదినంగా ప్రకటిస్తూ సెలవులు ప్రకటించారు. 24 మంగళవారం కూడా సెలవు దినంగా తెలిపింది. విజయ దశమి (Vijayadashami) ని చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. దీని వెనుక ఉన్న పురాణ కథ.. పూర్వం దుర్గాదేవి శంభుడు, నిశంభుడు అనే రాక్షసులు ఉండే వారు. వారిద్దరూ దేవతలను, మునులను, ముని పత్నులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసే వారు. శంభుడు, నిశంభుడు ఇద్దరు కూడా బ్రహ్మ నుంచి తమకు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు. కానీ తమకు సమమైన, ధైర్యవంతురాలైన మహిళ చేతిలో మాత్రమే తమకు మరణం కావాలని కోరుకుంటారు. బ్రహ్మా ఆ వరాన్ని వారికి ప్రసాదించాగా గర్వం తలకెక్కిన రాక్షసులు దేవతలను హింసించడం మొదలెట్టారు. రోజురోజుకి వారి అరాచకాలు పెరిగిపోవడంతో వారిని మట్టుబెట్టేందుకు ఆదిపరాశక్తి, కాళికా, కళరాత్రిగా ఉద్భవించింది. కాళికా దేవికి సాయంగా ముగ్గురమ్మల రూపమైన అష్టమాధులు, అష్టరాత్రులుగా ఉద్భవించారు. అమ్మవారు నవరాత్రి దేవతలుగా ఉద్భవించి శంభుడు, నిశంబులను సంహరించింది. దీంతో రాక్షసుల బారి నుంచి తప్పించుకున్న దేవతలు మహిషాసుర మర్దిని అయిన దేవిని స్తుతించారు. అందుకే దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు. కొన్ని పురాణాల ప్రకారం..శ్రీరాముడు రావణాసురుడ్ని చంపింది కూడా విజయ దశమి రోజునే అని చెబుతున్నాయి. ఆ ప్రకారం..దసరా నవరాత్రులు నిర్వహిస్తున్నారని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. Also read: దసరా తర్వాతే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. కారణమిదే? #dussehra-2023 #dussera-2023 #dussera-date మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి