Vishaka: విశాఖ నక్కపల్లి ఆస్పత్రిలో అర్థరాత్రి హై టెన్షన్ నెలకొంది. పలు సమస్యలతో రెండ్రోజుల క్రితం ఇన్‌పేషెంట్స్‌గా చేరిన 24మంది బాధితులకు ఇంజక్షన్ రియాక్షన్ ఇచ్చింది. రాత్రి సెఫోటాక్సిన్ ఇంజక్షన్ ఇవ్వడంతో పేషెంట్లకు తీవ్రంగా చలి జ్వరం, వాంతులు అయ్యాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
Also Read: నంద్యాలలో బాలికను ముగ్గురు టెన్త్ విద్యార్థులు రేప్ చేసి.. చివరకు!
ముందు జాగ్రత్తగా అంబులెన్సుల్లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి బాధితులను తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందంటున్నారు డాక్టర్లు. ఈ ఘటనపై హోం మినిస్టర్ అనిత ఆరా తీశారు.