/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/pawan-kalyan-3-1-jpg.webp)
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన వాయిదా పడింది. ఆయనకు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతోపాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేశారు. కనీసం రెండుమూడు రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తారు. రీ షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తారని తెలిపారు. ఆరోగ్యం కుదుటపడిన తరవాత తెనాలి విచ్చేసి వారాహి సభలో పాల్గొంటానని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అస్వస్థతకు లోనవడం మూలంగా తెనాలిలో నిర్వహించవలసిన వారాహి యాత్ర, సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యం కుదుటపడిన తరవాత తెనాలి విచ్చేసి వారాహి సభలో పాల్గొంటాను.
🙏— Pawan Kalyan (@PawanKalyan) April 3, 2024