Dastagiri: వివేకాను హత్య చేసి తప్పు చేశా.. ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నా.. దస్తగిరి సంచలనం!

తాను చావడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు దస్తగిరి. వివేకా రెడ్డిని హత్య చేసి తప్పు చేశానన్నారు. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా అప్రూవర్ గా మారి ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. పులివెందుల నుండి జగన్ కు పోటీగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.

New Update
Dastagiri: వివేకాను హత్య చేసి తప్పు చేశా.. ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నా.. దస్తగిరి సంచలనం!

Driver Dastagiri: వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి RTVతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. వివేకానంద రెడ్డిని హత్య చేసి తప్పు చేశానన్నారు. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా అప్రూవర్ గా మారి నిజం ఒప్పుకున్నానన్నారు. తప్పు తెలుసుకున్నాను కాబట్టే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. జై భీమ్ భారత్ పార్టీ నుండి పులివెందులలో జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.

Also Read: వైసీపీకి మరో షాక్‌.. బీజేపీలో చేరిన ఎమ్మెల్యే..!

తాను ఒక హత్య చేసి తప్పు ఒప్పుకున్నానని.. కానీ జగన్ ఐదేళ్లగా రాష్ట్రాన్ని రకరకాలుగా హింసిస్తున్నాడని ఆరోపించారు. తన ప్రాణాల మీద ఎప్పుడో ఆశ వదిలేసుకున్నానని కామెంట్స్ చేశారు. తాను చావడానికైనా సిద్ధంగానే ఉన్నట్లు వెల్లడించారు. కానీ, ప్రజలకు కొంత సేవ చేయాలనుకున్నానని అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు.

Also Read: టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ కలకలం.. కేశినేని చిన్ని ఆరోపణలు!

తనపై ఎప్పుడైనా దాడి జరిగే అవకాశం ఉందన్నారు. కోట్లు స్కాములు, ప్రజలను మోసం చేస్తున్న వాళ్లే రాజకీయాలు చేస్తున్నారని.. కానీ, నాలాంటి సామాన్యుడు రాజకీయాల్లోకి రాకూడదా అని ప్రశ్నించారు. జగన్ ప్రచారం చేసిన ప్రతి వీధికి వెళ్లి ఓటు అడుగుతానని.. జగన్ కు పోటీగా నిలబడతానని వ్యాఖ్యానించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు