కొందరికి ఎక్కిళ్ళు ఉంటాయి. ఎక్కిళ్ళు ప్రారంభమైతే అవి చాలా త్వరగా ఆగవు. కాబట్టి పాలు, ఇంగువ కలిపి తాగడం వల్ల మేలు జరుగుతుంది. దీంతో ఎక్కిళ్ళ సమస్యని పరిష్కరించుకోవచ్చు.ఎవరైనా పైల్స్‌తో బాధపడుతుంటే ఆముదం పాలు వారికి చక్కని పరిష్కారం. ఈ సమస్యని తగ్గించేందుకు ఆముదం పాలు బాగా పనిచేస్తాయి. ఇది పైల్స్ నొప్పిని కూడా దూరం చేస్తుంది.పాలలో ఇంగువని కలిపి తీసుకోవడం వల్ల లివర్‌కి చాలా మంచిది. దీని వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. ఆముదం పాలు తాగడం వల్ల శరీరం యాక్టివ్ అవుతుంది. అనేక ప్రయోజనాలు అందిస్తుంది.
ఆముదం పాలు తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇంగువ తీసుకోవడం వల్ల మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్, అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియకి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే పాలలో చిటికెడు ఇంగువ కలిపి తాగడం మంచిది.గోరువెచ్చని పాలలో ఇంగువ కలిపి రాత్రి తీసుకోవచ్చు. దీనికోసం, ఓ గ్లాసు వేడి పాలలో చిటికెడు ఇంగువ వేసి బాగా కలపండి. అవసరమైతే అందులో కొద్దిగా చక్కెర, బెల్లం వేసి తాగొచ్చు.
చెవి బాగా నొప్పిగా ఉంటే ఇంగువ కలిపిన పాలు చెవి రాయడం వల్ల రిలాక్స్ అవ్వొచ్చు. కొన్ని చుక్కల ఇంగువని మేకపాలతో కలిపి చెవిలో వేసుకుంటే చెవిలో చుక్కలా పనిచేస్తుంది. రాత్రి చెవిలో పెట్టుకుని ఉదయం చెవిని శుభ్రం చేసుకోవాలి.