Chamanti Tea: ఉదయం చామంతి టీ తాగడం మంచిదని న్యూట్రిషనిస్ట్ నిపుణులు అంటున్నారు. చామంతిలోని ఫ్లేవనాయిడ్స్ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో ఈ టీ తాగితే హెల్దీగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవాళ్లు చామంతి టీ తాగాలని చూచిస్తున్నారు. ఈ టీలో ఉండే ఎపిజెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గఢనిద్ర పట్టేలా చేస్తుంది. ప్రతిరోజూ చామంతి టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో.. ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
చామంతి టీ తాగితే కలిగే ప్రయోజనాలు:
- ఈ సీజన్లో రోజూ వేడివేడి చామంతి టీ తాగటం వలన మనసు తేలికవుతుంది. అంతేకాకుండా మూడ్ స్వింగ్స్ ఉంటే ఈ టీ మూడ్ మారుతుంది. చలికాంలో జలుబు సమస్య నుంచి ఉపశమనం ఉంటుంది.
- చామంతి టీ ఆవిరి పట్టినా ముక్కు కారడం, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి.
- నెలసరి నొప్పులు తగ్గాలంటే చామంతి టీ మంచిది. ఈ టీలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బ్లడ్‌షుగర్‌ని తగ్గిస్తాయి.
- చామంతి టీలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. డయాబెటిస్ రోగులు ఈ టీ తాగిన మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.