పంట పొలాల్లో DRDO డ్రోన్‌.. పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డ ప్రజలు! వీడియో

డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన మానవరహిత వైమానిక వాహనం (UAV) కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని వడ్డికెరె పంట పొలాల్లో కూలిపోయింది. ఈ ఘటనలో UAV పూర్తిగా ధ్వంసమైంది. డ్రోన్‌పై TAPAS-07A-14 అని నంబర్ రాసి‌ ఉంది.

New Update
పంట పొలాల్లో DRDO డ్రోన్‌.. పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డ ప్రజలు! వీడియో

DRDO TAPAS unmanned aerial vehicle crashes: డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) అభివృద్ధి చేసిన డ్రోన్‌ కుప్పకూలింది. కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇది మానవరహిత వైమానిక వాహనం (UAV). హిరియూర్ తాలూకాలోని వడ్డికెరె గ్రామం వెలుపల పంట పొలాల్లో డ్రోన్ క్రాష్‌ అయ్యింది. డ్రోన్‌పై TAPAS-07A-14 అని నంబర్ రాసి‌ ఉంది. ఘటన జరిగిన సమయంలో పెద్ద శబ్దం రావడవంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఆర్‌డీవో అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఫీల్డ్‌లో చెల్లాచెదురుగా డ్రోన్‌ పరికరాలు పడి ఉన్నాయి. UAV పూర్తిగా ధ్వంసమైంది.


UAV TAPAS అంటే:

➼ TAPAS అనేది సాయుధ దళాల ఇంటెలిజెన్స్, నిఘా, ట్రాకింగ్ అండ్‌ రికనైసెన్స్ (ISTAR) అవసరాలను పరిష్కరించడానికి DRDO ఎంచుకున్న పరిష్కార మార్గం.

➼ ఇది అడ్వాన్స్‌డ్ సర్వైలెన్స్ కోసం టాక్టికల్ ఏరియల్ ప్లాట్‌ఫారమ్‌.

➼ ఇది ఏరో ఇండియా ఎయిర్ షో, ఏవియేషన్ డిస్‌ప్లేలో మొదటి సారి విమాన ప్రదర్శనను అందించింది. స్టాటిక్ వైమానిక ప్రదర్శనల ద్వారా UAV దాని సామర్థ్యాలను ప్రదర్శించింది.

➼ 28,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు

➼ 18 గంటల కంటే ఎక్కువ సమయం గాల్లో ఉండగలదు

➼ ఇది అటానమస్‌గా గాల్లో ఎగరగలదు. లేదా రిమోట్ కంట్రోల్‌ ద్వారా కూడా పనిచేయగలదు.

➼ రాత్రివేళల్లోనూ ఇది ఎగరగలదు.

గతేడాది ఫిబ్రవరీలోనూ చిత్రదుర్గ జిల్లాలో ఇదే తరహా ఘటన జరిగింది. జోడిచిక్కెనహళ్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మానవరహిత డ్రోన్‌ క్రాష్ అయ్యింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు