Vishaka: విధ్వంసానికి గురైన ఎర్రమట్టి దిబ్బలను వాటర్ మాన్ ఆఫ్ డాక్టర్ రాజేంద్ర సింగ్ పరిశీలించారు. జియో లాజికల్ సైంటిస్ట్ రాజశేఖర్ రెడ్డి, జల బిలాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ, కార్పొరేటర్ మూర్తి యాదవ్ తో కలిసి పరిశీలించారు. వారసత్వ సంపద పరిరక్షణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ అన్నారు.
ప్రపంచంలో అరుదైన ప్రాంతంగా ఎర్రమట్టి దిబ్బలను గుర్తించాలన్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం జియో హెరిటేజ్ ప్రాంతంగా గుర్తించిన నేపద్యంలో పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు. జియో లాజికల్ విద్యార్థులకు ఎర్రమట్టి దిబ్బలను పరిశోధించేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. భావితరాలకు సురక్షితంగా భౌగోళిక వారసత్వ సంపదను అందజేయాలన్నారు. ఎర్ర మట్టి దిబ్బలలో మొక్కల వేర్లను కూడా అధ్యయనం చేయవచ్చన్నారు.