/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bus--jpg.webp)
Tirupati to get Electric Double-decker Bus: తిరుపతి రోడ్లపై ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు చక్కర్లు కొట్టనున్నంది. తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి బస్సును ప్రారంభించారు. నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్డు, నూతనంగా నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లు, శ్రీనివాససేతుపై నడిపారు. బస్సు బాధ్యతలను ఆర్టీసీకి అప్పగిస్తామని అధికారులు తెలిపారు. త్వరలో నగర రోడ్లపై బస్సును అందుబాటులో తీసుకొస్తామని వివరించారు.
హైదరాబాద్ తర్వాత డబుల్ డెక్కర్ బస్సు సౌకర్యం కలిగిన ఏకైక నగరంగా తిరుపతి నిలిచింది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ బస్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. స్విచ్ మొబిలిటీ అనే సంస్థ సహకారంతో దీనిని కొనుగోలు చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ భాగస్వామ్యంతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నడపనున్నారు.
ప్రజాస్పందన ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని డబుల్ డెక్కర్ బస్సులు కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని అధికారులు చెప్పారు. కాలుష్య, శబ్ద రహితమైన ఏసీ, విద్యుత్తు డబుల్ డెక్కర్ బస్సును తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రూ.2కోట్లతో కొనుగోలు చేసింది. స్విచ్ అనే తయారీ సంస్థ 65 సీట్ల సామర్థ్యంతో, అధునాతన టెక్నాలజీతో దీన్ని రూపొందించింది.
Also Read: నా చిన్ననాటి బస్సు దొంగతనం అయింది.. పోలీసులకు ఆనంద్ మహీంద్ర ఫిర్యాదు