Pre Heating Foods: రాత్రి చేసుకున్న కూరగాయలు, రైస్, లేదా ఇతర ఏవైనా ఫుడ్స్ ఐటమ్స్ మిగిలిపోతే .. వృధా చేయడం ఎందుకని ఉదయం వాటిని మళ్లీ వేడి తినడం చేస్తుంటాము. ఆహారాన్ని వేస్ట్ చేయకుండా ఇలా చేయడం మంచి పనే. అయితే కొన్ని ఆహారాలు మాత్రమే ఇలా చేయడం ఆరోగ్యానికి ప్రమాదం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
రైస్
అన్నం స్టోర్ చేయడం సమస్యలకు కారణమవుతుంది. సాధారణంగా బియ్యంలోని స్పోర్స్ ను బాక్టీరియా గా కనవర్ట్ అవుతాయి. బియ్యం కుక్ చేసిన తర్వాత కూడా ఇవి అలాగే ఉంటాయి. రూమ్ టెంపరేచర్ లో అన్నానని స్టోర్ చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా డబుల్ అయ్యి.. టాక్షిన్స్ ఉత్పత్తికి కారణమవుతుంది. అందుకే మళ్ళీ దీన్ని ప్రీ హీట్ చేసి తినడం ద్వారా వామితింగ్స్, డయేరియా వంటి సమస్యలు వస్తాయి.
మష్రూమ్స్
మష్రూమ్స్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. వీటిని వండిన రోజే తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణుల సూచన. మష్రూమ్స్ మళ్ళీ హీట్ చేసి తింటే మిమ్మల్ని మీరు రిస్క్ లో పెట్టుకున్నట్లే. ప్రీ హీట్ చేయడం ద్వారా వీటిలోని ప్రోటీన్ స్ట్రక్చర్ మారిపోతుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదం. దీని వల్ల జీర్ణక్రియ, గుండె సమస్యలకు ప్రమాదాన్ని కలిగిస్తుంది.
Also Read: Moong Dal Halwa: నోరూరించే పెసర పప్పు హల్వా.. సింపుల్ అండ్ ఈజీ
ఆకుకూరలు
ఆకుకూరల్లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. వీటిలో ఐరన్, నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. వీటిని ప్రీ హీట్ చేసినప్పుడు నైట్రేట్స్.. నైట్రైట్స్ అంటే కార్సినోజెన్స్ గా మారుతాయి. ఇవి సెల్స్ DNA లో మార్పులు చేసి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కలిగిస్తాయి.
టీ
సాధారణంగా టీ ఒకసారి వేడి చేస్తే పర్వాలేదు. కానీ పదే పదే హీట్ చేయడం ద్వారా దాని ఫ్లేవర్, నాణ్యత తగ్గిపోతుంది. అలాగే మిగిలిపోయిన టీ లో బ్యాక్టీరియా, జెర్మ్స్ ఎక్కువగా డెవెలప్ అవుతాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
ఆయిల్
నివేదికల ప్రకారం వంట నూనెను మళ్ళీ హీట్ చేసి వాడడం ఆరోగ్యానికి హానికరం. ప్రీ హీట్ చేయడం ద్వారా హానికరమైన టాక్షిన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి నూనె ఫ్లేవర్, నాణ్యతను తొలగించి తినడానికి వీలు లేకుండా చేస్తాయి. ఆక్సీకరణ జరిగి నాణెలోని పోషకాలను విషపూరితంగా మారుస్తుంది. అందుకే ఆయిల్ ఫ్రెష్ గా వాడడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
Also Read: Cauliflower: ఏంటీ కాలిఫ్లవర్ అతిగా తింటున్నారా.. అయితే జాగ్రత్త