ఇక వాళ్లను 420 కాదు... అలా అనాలేమో....!

420..ఈ నంబర్ చెప్పగానే... చీటింగ్, చీటర్ అని.. చట్టాల గురించి అవగాహన లేని వారు కూడా చటుక్కున చెప్పేస్తారు. అంతలా ఇండియన్ పీనల్ కోడ్ లోని ఈ సెక్షన్ ఫేమస్ అయింది. కానీ ఆ సెక్షన్ బదులుగా సెక్షన్ 316 ను కేంద్రం తీసుకురానుంది.

author-image
By G Ramu
New Update
Chandrababu Arrest: చంద్రబాబు కేసులో మరో ట్విస్ట్.. 30 నిమిషాలు టైమ్ ఇచ్చిన ఏసీబీ కోర్టు..

420..ఈ నంబర్ చెప్పగానే... చీటింగ్(cheating), చీటర్ (cheater) అని.. చట్టాల గురించి అవగాహన లేని వారు కూడా చటుక్కున చెప్పేస్తారు. అంతలా ఇండియన్ పీనల్ కోడ్(ipc) లోని ఈ సెక్షన్ ఫేమస్ అయింది. ఈ నంబర్ ను టైటిల్ పెట్టుకుని వచ్చిన సినిమాలు భారీ విజయాలను కూడా అందుకున్నాయి. అంతలా ఫేమస్ అయిన ఈ సెక్షన్ ఇప్పుడు మారి పోనుంది. ఇక త్వరలో 163 ఏండ్ల పురాతన సెక్షన్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత 316 సెక్షన్ ను తీసుకురానుంది.

కేవలం ఈ ఒక్క సెక్షన్ మాత్రమే కాదు. మర్డర్-302 సెక్షన్ కు బదులు సెక్షన్-101, ఇక 114 సెక్షన్ కు బదులు 187 నిబంధనను కేంద్రం తీసుకు రానుంది. ఏండ్లు గడిచిన కొద్ది నిర్బయ లాంటి ఘటనలు, ఇతర నేరాల నేపథ్యంలో సవరణలు తీసుకు రావడం, కొత్త కొత్త సెక్షన్లు, సబ్ సెక్షన్లు తీసుకు రావడంతో ఇండియన్ పీనల్ కోడ్ భారీగా తయారైంది. దీంతో వాటిని సరళీకరించి మార్పులు తీసుకు రావాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటి వరకు ఇండియన్ పీనల్ కోడ్ లో 511 సెక్షన్లు వున్నాయి. దాని బదులుగా కేంద్రం నూతనంగా తీసుకు వస్తున్న భారతీయ న్యాయ సంహితలో 356 సెక్షన్లు వుండనున్నాయి. ఐపీసీలో 175 సెక్షన్లకు కేంద్రం సవరణలు చేసింది. మరో ఎనిమిది కొత్త సెక్షన్లను జోడించింది. 22 సెక్షన్లను రద్దు చేసినట్టు ఇటీవల ప్రకటించింది. ఇక సీఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహితను తీసుకు రానుంది.

ఇండియన్ ఎవిడెన్స్ చట్టం బదులుగా భారతీయ సాక్ష అదిన్యాయాన్ని అమలు చేయనుంది. ఇందులోనూ పలు సెక్షన్లు వుంటాయి. ఇటీవల తీసుకు వచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ లోనూ అదే నమూనాను ఫాలో అయింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు