హెయిర్ ఫాల్ కు ఇలా చెక్ పెట్టేయండి!

పొల్యూషన్, పోషకాహార లోపం కారణంగా జుట్టుకి రకరకాల ప్రాబ్లెమ్స్ రావడం సహజం. అయితే జుట్టుని అప్పుడప్పుడు డీటాక్స్ చేయడం ద్వారా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ హెయిర్ డీటాక్స్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ ఫాల్ కు ఇలా చెక్ పెట్టేయండి!
New Update

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మాడు మీది చర్మం(స్కాల్ప్) ఆరోగ్యంగా ఉండాలి. అందుకే అప్పుడప్పుడు దాన్ని పూర్తిగా డీటాక్స్ చేయాలి. జుట్టుకి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు ముందుగా హెయిర్ కట్ చేయించుకుని డీటాక్స్ మొదలుపెట్టాలి. చాలా తక్కువ లెంగ్త్ ఉండేలా జుట్టు కత్తిరించుకుని కొంతకాలం పాటు షాంపూలు, క్రీములు వాడకుండా జుట్టుని సహజంగా పెరగనివ్వాలి. ప్రతిరోజూ తలకు కొబ్బరి నూనె రాస్తూ.. రెండు రోజులకోసారి తల స్నానం చేయాలి. స్నానానికి కుంకుడుగాయలు వాడాలి.

జుట్టుని డీటాక్స్ చేయడంలో భాగంగా స్కాల్ప్‌కు కొన్ని ప్యాక్స్ కూడా వేసుకోవచ్చు. మందార ఆకుల పేస్ట్ లేదా పెరుగు, తేనే కలిపిన పేస్ట్ లేదా నిమ్మరసం, తేనె పేస్ట్‌ని మాడుకి అప్లై చేసి ఇరవై నిముషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు, కుదుళ్లలో పేరుకుపోయి ఉన్న జిడ్డు అంతా పోతుంది. కుదుళ్లు క్లీన్ అవుతాయి. తద్వారా హెయిర్ ఫాలికల్స్‌లో గ్రోత్ ఉంటుంది. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు పూర్తిగా తగ్గుతాయి.

హెయిర్ డీటాక్స్‌లో జుట్టు పొడవుని తగ్గించడం చాలా ముఖ్యం. మాడుపై ఉండే జిడ్డు, క్రిములు తొలగిపోవాలంటే జుట్టు పొడవు తక్కువగా ఉండాలి. ఇలా హెయిర్ డీటాక్స్ మూడు నెలలకోసారి చేయొచ్చు. రెండు మూడు సార్లు ఇలా చేస్తే మాడు మీది చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అన్ని రకాల జుట్టు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆ తర్వాత జుట్టుని నచ్చినట్టుగా పెంచుకోవచ్చు. ఇక వీటితోపాటు జుట్టు ఆరోగ్యానికి నీళ్లు తాగడం కూడా అవసరం. రోజుకి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. కూరగయాలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. జుట్టు పోషణ కోసం నట్స్ కూడా తింటుండాలి. డీటాక్స్ సమయంలో జుట్టుకి దుమ్ము, ధూళి తగలకుండా జాగ్రత్తపడడం కూడా ముఖ్యమే.

#hair-problems
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe