Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతవారణం కొనసాగుతుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుడు టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీదేవి చనిపోగా.. తీవ్ర గాయాలైన భాస్కర్ రెడ్డి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఆందోళన పరిస్థితి కొనసాగుతుంది.
Also Read: అధికారులకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్..!
తాజాగా, శ్రీదేవి హత్యలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏవీ సుబ్బారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన తోపాటు మొత్తం 15 మంది అనుమానితులపై కేసు నమోదు అయింది.
FIRలో ఉన్న 15 మంది పేర్లు:
A1 వేణుగోపాల్ రెడ్డి
A2 శిరీష
A3 కేదార్నాథ్ రెడ్డి
A4 ఏవి సుబ్బారెడ్డి
A5 ఏవి రుక్మిణి దేవి
A6 ఏవి జశ్విత రెడ్డి
A7 చరిష్మా రెడ్డి
A8 జాహ్నవి రెడ్డి
A9 ఏవీ సూర్యనారాయణ రెడ్డి
A10 కొండారెడ్డి
A11 హుస్సేన్ రెడ్డి
A12 దూదేకుల రాకేష్ అలియాస్ రాఖి
A13 నరేష్
A14 దేవేంద్ర కుమార్
A15 శేఖర్ సింగ్
వీరిలో A1 వేణుగోపాల్ రెడ్డి, A2 శిరీష, A3 కేదార్నాథ్ రెడ్డి, A13 నరేష్, A14 దేవేంద్ర కుమార్, A15 శేఖర్ సింగ్ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారు. ప్రస్తుతం, పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జాగిలాలను రంగంలోకి దింపారు. కేసులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: వైసీపీకి షాక్.. మరో పార్టీ కార్యాలయానికి నోటీసులు
కాగా, భూమా ఫ్యామిలీ, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాలు అనేక సార్లు దాడులు, ప్రతిదాడులు చేసుకున్నాయి. వీరి మధ్య అనేక సార్లు గొడవలు జరిగినా టీడీపీ అధిష్టానం మాత్రం సైలెంట్ గా ఉంది. ఏది ఏమైనా ఈ రెండు వర్గాల ఘర్షణలతో ఆళ్లగడ్డ మాత్రం అట్టుడుకుతుంది.