IPL 2024 Playoffs: ముంబైకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ఉందా ?

10 మ్యాచ్ ల్లో మూడు విజయాలే సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్ధానంలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా ప్లేఆఫ్ అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది.అయితే ముంబై ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం!

IPL 2024 Playoffs: ముంబైకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ఉందా ?
New Update

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ (IPL 2024) లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకుంటున్నాయి. హోరాహోరీ మ్యాచ్ ల నేపథ్యంలో పాయింట్లు ఎప్పటికప్పుడు మారిపోతుండటంతో ప్లేఆఫ్ కు అర్హత సాధించే టాప్ 4 జట్లపై ఉత్కంఠ పెరుగుతోంది. నిన్న జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఈ ఉత్కంఠను పతాకస్దాయికి తీసుకెళ్లింది. కేవలం ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ పై గెలిచిన సన్ రైజర్స్.. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

అదే సమయంలో ఆడిన 10 మ్యాచ్ ల్లో మూడు విజయాలే సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో చివరి నుంచి రెండో స్ధానంలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా ప్లేఆఫ్ అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఆ జట్టు తర్వాత ఆడబోయే మ్యాచ్ ల్లో విజయాలు సాధించే అవకాశాలు ఉండటమే. ముంబై పట్టుదలగా ఆడి వచ్చే నాలుగు మ్యాచ్ లు గెలిస్తే 14 పాయింట్లు సాధించి టాప్ 4లో నిలిచే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.

ఈ అద్భుతం జరగాలంటే ఇప్పటికే టాప్ 2 స్ధానాల్లో ఉన్న రాజస్థాన్, కోల్ కతా అవే స్ధానాల్లో కొనసాగడంతో పాటు మరికొన్ని సమీకరణాలు అవసరమవుతాయి. ఇందులో ప్రస్తుతం 12 పాయింట్ల చొప్పున ఉన్న లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో విజేతకు 14 పాయింట్లు వస్తాయి. ఆ తర్వాత వీరికి మిగిలిన అన్ని మ్యాచ్ ల్లోనూ వీరు ఓడిపోయి ముంబై తమ తర్వాతి 4 మ్యాచ్ లూ గెలిస్తే 14 పాయింట్ల సాధించి వారితో సమం అవుతుంది.

అయితే ఇవాళ కోల్ కతాతో జరిగే మ్యాచ్ లో ముంబై ఓడిపోతే అప్పుడు కూడా మిగతా జట్లతో సమానంగా ముంబై 12 పాయింట్ల సాధించి ప్లే ఆఫ్ పోటీలో ఉంటుంది. అప్పుడు మెరుగైన రన్ రేట్ ఉంటే ప్లే ఆఫ్ కు అర్హత సాధించవచ్చు. అలాగే బెంగళూరు కూడా దాదాపుగా ముంబై తరహాలోనే పోటీలో ఉండే అవకాశం ఉంది. మరోైవైపు ప్రస్తుతం టాప్ లో రాజస్థాన్ రాయల్స్ కు కూడా ప్లే ఆఫ్ ఛాన్స్ మిస్సయ్యే ప్రమాదం పొంచి ఉంది. రాజస్థాన్ తమ తర్వాతి మ్యాచ్ లన్నీ ఓడిపోతే దానికి బదులుగా కోల్ కతా, హైదరాబాద్, లక్నో, చెన్నై ప్లేఆఫ్ కు అర్హత సాధించనున్నాయి.

#ipl-2024-playoffs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe