Wall Clock Vastu Tips:మీ ఇంట్లో గోడ గడియారం ఆ దిక్కున పెడుతున్నారా ? అయితే .. సమస్యలు చుట్టుముడతాయి!!

గోడ గడియారం లేని ఇల్లంటూ ఉండదు. అయితే మన ఇంట్లో ఉండే గోడ గడియారానికి మన ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచే , క్షీణింపజేసే శక్తి ఉంటుందని చాలా మందికి తెలియదు. వాస్తు ప్రకారం ఇంట్లో దక్షిణ వైపు గోడకు పెడితే ఒత్తిడితో పాటు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Wall Clock Vastu Tips:మీ ఇంట్లో గోడ గడియారం ఆ దిక్కున పెడుతున్నారా ? అయితే .. సమస్యలు చుట్టుముడతాయి!!
New Update

Clock Vastu Tips:టైం .. ప్రతీ మనిషికి టైం బాగుండాలంటే ..మన ఇంట్లో టైం సెట్ చేసే దిశ బాగుండాలి. గోడకు గడియారాన్ని పెట్టేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. ప్రస్తుత కాలంలో ప్రతి చేతికి మొబైల్ ఫోన్ ఉంటుంది, దానికి వాచీ కూడా ఉంటుంది.పూర్వం ఇంట్లో గడియారం ఉండటాన్ని స్టేటస్ సింబల్‌గా భావించేవారు. ఇప్పుడున్న ట్రెండ్ లో స్మార్ట్ వాచీలు వచ్చేశాయి. ఇప్పుడంతా స్మార్ట్ వాచ్ స్టేటస్ సింబల్. మన దైనందిన జీవితంలో గడియారాన్ని ఉన్న ప్రాధాన్యత ఇంకా దేనికి ఉండదు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన గడియారం ఇంట్లో గడకు పెట్టేటప్పుడు మాత్రం కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి.

ఏ దిక్కులో గడియారాన్ని సెట్ చేయాలి

ఇంట్లో గోడగడియారం పెట్టేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టాలి. ఇష్టం వచ్చిన స్థానాల్లో పెడితే చిక్కుల్లో పడతారు.వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో వస్తువులను సరైన స్థలంలో ఉంచకపోతే ప్రతికూల శక్తులు ఆవహిస్తాయి. తద్వారా ఇది ఇంట్లో అందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. గోడ గడియారాన్ని ఇంట్లో సరైన దిశలో ఉంచినట్లయితే, అది మంచి ఫలితాలను ఇస్తు..

పాజిటివ్ వైబ్స్ తీసుకువస్తుంది. ఇది ఒక్క ఇంటికే పరిమితం కాదు .. మీ కార్యాలయాల్లోనూ ఇది వర్తిస్తుంది.

మీ గడియారాన్ని ఈ దిశలో ఉంచవద్దు

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇల్లు లేదా కార్యాలయం యొక్క దక్షిణ గోడపై గడియారాన్ని ఉంచకూడదు ఎందుకంటే హిందూ గ్రంధాల ప్రకారం, దక్షిణ దిశను మృత్యుదేవత యొక్క దిశగా పరిగణిస్తారు. వ్యాపార స్థలంలో ఈ దిశలో గడియారాన్ని ఉంచడం ద్వారా వ్యాపార మార్గంలో అడ్డంకులు రావడం ప్రారంభమవుతాయని, అభివృద్ధి ఆగిపోతుందని నమ్ముతారు. అదేవిధంగా, ఇంటి దక్షిణ గోడపై గడియారాన్ని ఉంచడం వల్ల కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ప్రధాన ద్వారం పైన ఉంచవద్దు

చాలా మంది ఇంటి ప్రధాన ద్వారం పైన గోడ గడియారం పెడతారు., ఇలా చేయడం వల్ల చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది.  వాస్తు ప్రకారం, గడియారాన్ని తలుపు పైన ఉంచకూడదు ఎందుకంటే దాని గుండా వెళ్ళే వ్యక్తులు జీవితంలో ఒత్తిడితో పాటు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఆగిపోయిన వాచీలతో నెగిటివ్ వైబ్రేషన్స్

చాలా మంది ఇళ్లలో పాడయిపోయిన గడియారాలు అలాగే గోడకు తగిలించేసి ఉంటాయి. వాటిని వెంటనే తొలగించడం మంచిది. ఆగిపోయిన వాచీలు, విరిగిపోయినవి ఇంట్లో ఉంటె నెగిటివ్ వైబ్రేషన్స్ వెంటాడుతాయి. మీ ఇంట్లో అలాంటి గడియారం ఉంటే, సానుకూల శక్తికి ఆటంకం కలగకుండా వెంటనే దాన్ని తొలగించండి.అర్ధమయింది కాదా,, ఇంట్లో టైం సెట్ చేసే దిశ బాగుంటే .. మన టైం బాగుంటుంది.లేకపోతే ఒత్తిడితో పాటు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ALSO READ: కాగితపు జెండాల పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ .. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు !!

#vastu-tips #wall-clock-vastu #astro-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe