Lord Brahma: ఉగాది అంటే యుగానికి ఆరంభమని చెబుతారు. మరి అలాంటి యుగానికి మూలకారకుడైన బ్రహ్మకు దేశంలో ఒకటే ఆలయం ఉందంటే నమ్ముతారా? సృష్టికర్త అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బ్రహ్మదేవుడే. ఆయన నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు ఆవిర్భవించాయి. మరి అలాంటి బ్రహ్మకు పూజార్హత ఎందుకు లేదో తెలుసుకుందాం..
Also Read: ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల తల్లి ఏం చేసిందో చూడండి
పద్మ పురాణం ప్రకారం, ఒకప్పుడు బ్రహ్మ దేవుడు లోక కల్యాణం కోసం పుష్కర్‌లో యాగం నిర్వహించాడు. ఈ యాగంలో భార్యతో కలిసి కూర్చోవాల్సి ఉండగా భార్య సరస్వతి మాత్రం ఆలస్యంగా చేరుకుంది. పూజ సమయం గడిచేకొద్దీ, బ్రహ్మా ఓ స్థానిక గోవుల కాపరిని వివాహం చేసుకుని యాగంలో కూర్చున్నాడు. ఆ తర్వాత కాసేపటికి సరస్వతి అక్కడికి చేరుకుంది. యాగంలో బ్రహ్మా పక్కన కూర్చున్న మరొక స్త్రీని చూసి ఆమె విపరీతమైన కోపం తెచ్చుకుంది. ఆ క్షణంలో ఆమె బ్రహ్మాని శపించింది.
Also Read: అనపర్తి సీటుపై కొనసాగుతున్న గందరగోళం.. హాట్‌టాపిక్‌గా నల్లమిల్లి వ్యవహారం..!
ఈ ప్రపంచం బ్రహ్మను మరచిపోతుందని సరస్వతి శపించింది. దేవుడైనప్పటికీ బ్రహ్మను ఎప్పుడూ ఎవరూ పూజించరని శపించింది. సరస్వతి కోపాన్ని చూసి, యాగానికి హాజరైన దేవతలందరూ ఆమెను తన శాపాన్ని వెనక్కి తీసుకోమని కోరారు. కానీ అది సాధ్యం కాలేదు. అయితే, భూమ్మీద పుష్కరాల్లోనే బ్రహ్మదేవుని గుడి ఉంటుందని, అక్కడ మాత్రమే పూజలు అందుకుంటానని సరస్వతి చెప్పింది. మరేదైనా ఆలయాన్ని నిర్మిస్తే అది ధ్వంసం అవుతుందని శాపం పెట్టింది.