Toes : మీ కాలివేళ్ల మధ్య సందులు ఉన్నాయా.. అయితే మీరు అదృష్టవంతులు!

జ్యోతిష్యం ప్రకారం, కాలివేళ్ల ఆకారానికి, వ్యక్తిత్వ లక్షణాలకు మధ్య సంబంధం ఉంటుంది. చేతుల మీద ఉన్న గీతలు, శరీరాలపై ఉన్న మచ్చలు వ్యక్తిత్వం గురించి చాలా చెబుతాయి.

New Update
Toes : మీ కాలివేళ్ల మధ్య సందులు ఉన్నాయా.. అయితే మీరు అదృష్టవంతులు!

Holes Between Your Toes : సాధారణంగా శరీరం(Body) లోని అన్ని భాగాలకు ప్రాధాన్యత ఉన్నట్లే పాదాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కాలివేళ్ల(Toes) ఆకారాన్ని బట్టి అవి అందంగా ఉన్నాయా లేదా అనేది చెప్పవచ్చు. అందం ఒక్కటే కాదు కాలివేళ్ల ఆకారాన్ని(Toes Shape) బట్టి ఒకరు ఎలాంటి వారో కూడా చెప్పవచ్చు. ఈ షేప్ ఒకరి వ్యక్తిత్వం గురించి చాలా విషయాలను చెబుతుంది. జ్యోతిష్యం ప్రకారం, కాలివేళ్ల ఆకారానికి, వ్యక్తిత్వ లక్షణాలకు మధ్య సంబంధం ఉంటుంది. చేతుల మీద ఉన్న గీతలు, శరీరాలపై ఉన్న మచ్చలు వ్యక్తిత్వం గురించి చాలా చెబుతాయి. అదేవిధంగా, కాలివేళ్ల ఆకారం కూడా కొన్ని విషయాలు బయటపెడతాయి. అవేవో చూద్దాం.

పీసంట్ టోస్(Peasant Toes) అంటే దాదాపు ఒకే పొడవులో ఉండే వేళ్లు. ఈ వేళ్లు ఉన్న వ్యక్తులు సాధారణంగా చిన్న పాదాలను కలిగి ఉంటారు. వ్యక్తిత్వం పరంగా, ఈ వేళ్లు ఉన్న వ్యక్తులు ఓపికగా ఉంటారు. ఈ ఓపిక వల్ల వారు ఒత్తిడి లేకుండా, మానసిక ఆరోగ్య సమస్యలు లేకుండా తమ లక్ష్యాలను సాధించగలరు. వీళ్లు చక్కటి సలహా ఇస్తారు. అద్భుతమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. ప్రేమ విషయానికి వస్తే, చాలా నమ్మదగినవారు, నిజాయితీగా ఉంటారు.

Also Read : రిజర్వేషన్ల రద్దు.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌ ఫైర్‌

రోమన్ వేళ్లలో, మొదటి మూడు వేళ్లు ఒకే సైజులో ఉండగా, మిగిలిన వేళ్ల పరిమాణం క్రమంగా తగ్గుతుంది. మిగిలిన వేళ్లు పొడవుగా ఉండొచ్చు లేదా పొట్టిగా ఉండొచ్చు. ఈ వేళ్లు ఉన్న వ్యక్తులు సమతుల్యమైన ప్రవర్తనను కలిగి ఉంటారని నమ్ముతారు. ఈ వ్యక్తులు సాహసోపేతంగా, సోషల్లీ యాక్టివ్‌గా ఉంటారు. వీరు కొత్త ప్రదేశాలు, సంస్కృతులను అన్వేషించడానికి ఇష్టపడతారు. IQని పెంచుకోవడానికి, ప్రపంచం గురించి తమ అవగాహనను విస్తరించడానికి నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటారు. కొత్త సవాళ్లను స్వీకరించడం విషయానికి వస్తే, రోమన్ వేళ్లు ఉన్న వ్యక్తులు చాలా ధైర్యంగా ఉంటారు. వారు తరచుగా వర్క్‌ప్లేస్‌లో ప్రశంసలు అందుకుంటారు. అయితే, ఈ వేలు ఆకారం ఉన్న వ్యక్తులు స్వార్థపరులుగా ఉండే అవకాశముంది.

ఈ పాదాలలో బొటనవేలు ఇతర వేళ్ల నుంచి చాలా దూరంగా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే, బొటనవేలు, వేళ్ల మధ్య చాలా ఖాళీ స్థలం ఉంటుంది. వ్యక్తిత్వం పరంగా, ఈ వ్యక్తులు స్వతంత్రంగా ఉంటారు. సామాజిక నియమాల ద్వారా స్వేచ్ఛను పరిమితం చేయడం లేదా అణచివేయడం వారికి ఇష్టం ఉండదు. ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ వ్యక్తులు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వింటారు. చర్చలకు ఆకర్షితులవుతారు. తమకు తెలియని విషయం గురించి ఎవరితోనూ ఎప్పుడూ మాట్లాడరు, కాబట్టి మాట్లాడితే ఏదో ఒక ముఖ్యమైన విషయమే మాట్లాడతారు.

Advertisment
తాజా కథనాలు