Emergency Alert: మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ రాలేదా? అయితే వెంటనే ఇలా చేయండి..!

గత రెండు రోజులుగా మళ్లీ ఈ ఎమర్జెన్సీ అలర్ట్ మొబైల్ యూజర్లకు వస్తోంది. అయితే, కొందరికి మాత్రం ఎలాంటి అలర్ట్ రాలేదని చెబుతున్నారు. అయితే, ఇలా అలర్ట్ మెసేజ్ అందుకోని వారు సెట్టింగ్స్‌లో ఒక మార్పు చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మీ ఫోన్‌లో సెట్టింగ్స్‌ లోకి వెళ్లి సెర్చ్‌ బార్‌లో వైర్‌లెస్ ఎమర్జెన్సీ నోటిఫికేషన్ అని టైప్ చేయాలి. ఆ ఆప్షన్‌లో అలర్ట్స్‌ను ఆన్‌ చేయాలి.

Emergency Alert: మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ రాలేదా? అయితే వెంటనే ఇలా చేయండి..!
New Update

Emergency Alert: గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా మొబైల్ యూజర్స్ అందరికీ ఎమెర్జెన్సీ అలర్ట్ మెసేజ్((Emergency Alert System) వస్తోంది. సడెన్‌గా గుర్తు తెలియని మెసేజ్ అలారం మోగడంతో జనాలు చాలా కంగారుపడిపోయారు. అయితే, ఈ మెసేజ్ మన సెక్యూరిటీకి సంబంధించిందని, కేంద్ర ప్రభుత్వమే ఈ మెసేజ్‌ని పంపుతోందని తెలిసి హమ్మయ్య అనుకున్నారు. గత రెండు రోజులుగా మళ్లీ ఈ ఎమర్జెన్సీ అలర్ట్ మొబైల్ యూజర్లకు వస్తోంది. రెండు సార్లు నిర్వహించిన ఈ టెస్టింగ్‌లో చాలా మంది మొబైల్ ఫోన్లకు మెసేజ్ అలర్ట్ వచ్చింది. అయితే, కొందరికి మాత్రం ఎలాంటి అలర్ట్ రాలేదని చెబుతున్నారు.

ఇదికూడా చదవండి: భవ్యశ్రీ మృతిపై ఎస్పీ రిషాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!! అసలు ఏలా చనిపోయిందంటే..?

వాస్తవానికి తుఫానులు, భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను అలర్ట్ చేసేందుకు భారత ప్రభుత్వం వైర్‌లెస్‌ ఎమర్జెన్సీ అలర్ట్‌ వ్యవస్థను రూపొందించింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అలర్ట్‌ మెసేజ్‌ ద్వారా సమాచారం చేరవేయడమే దీని లక్ష్యం అని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ వ్యవస్థ ప్రస్తుతం టెస్టింగ్ స్థాయిలో ఉంది. టెస్టింగ్‌లో భాగంగా గత రెండు నెలలుగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు ఎమర్జెన్సీ అలర్ట్‌ మెసేజ్‌లు పంపిస్తోంది టెలికాం డిపార్ట్‌మెంట్. చాలా మందికి ఇప్పటికే ఇందుకు సంబంధించిన అలర్ట్‌ మెసేజ్‌లు వచ్చాయి. అయితే, కొందరికి మాత్రం ఇప్పటికీ ఎలాంటి అలర్ట్ మెసేజ్ రాలేదని చెబుతున్నారు. ఇలాంటి తమ ఫోన్‌లలో సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ సెట్టింగ్స్ ఏంటో ఓసారి చూద్దాం..

ఇదికూడా చదవండి: Telangana elections 2023: కిషన్‌రెడ్డి సంచలన హామీ.. అధికారంలోకి వస్తే వారికి 10 శాతం రిజర్వేషన్లు..!

మీ ఫోన్‌లో సెట్టింగ్స్‌(Settings)లోకి వెళ్లి సెర్చ్‌ బార్‌లో వైర్‌లెస్ ఎమర్జెన్సీ నోటిఫికేషన్(Wireless Emergency Notification) అని టైప్ చేయాలి. ఆ ఆప్షన్‌లో అలర్ట్స్‌ను ఆన్‌ చేయాలి. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం పంపే అన్ని రకాల ఎమర్జెన్సీ అలర్ట్స్ మీ మొబైల్‌కు అందాతాయి.

#indian-government #emergency-alert-message #telecom-department
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe