Vastu Tips : మీ పూజగదిలో ఈ 5 వస్తువులు ఉంటే దరిద్రం.. వెంటనే తీసేయండి.! ప్రతి ఒక్కరి ఇంట్లో పూజగది ఉంటుంది. మీ ఇంట్లో కూడా పూజగది ఉంటే ఈ నియమాలు అనుసరిస్తున్నారో లేదో ఓసారి చెక్ చేసుకోండి. ఒకవేళ పూజగదిలో ఇలాంటి వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి. ఆ వస్తువులు ఏవో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 07 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Vastu Tips : జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ దేవుడిని పూజిస్తారు. ఇంట్లో దేవుడిని పూజించేందుకు ప్రత్యేకంగా పూజగదిని కూడా నిర్మించుకుంటారు.హిందువుల ఇళ్లలో చాలా మంది ప్రతిరోజూ దేవుడిని దీపారధన చేస్తుంటారు. అయినప్పటికీ కొంతమంది ఇళ్లలో అశాంతి నెలకొంటుంది. దీనికి ప్రధాన కారణం పూజగదిలో వాస్తు దోషాలు.ఇంట్లో అశాంతి, తగాదాలకు కారణమయ్యే ఆలయానికి సంబంధించిన కొన్ని వాస్తు దోషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వీకుల ఫొటోలు: వాస్తు శాస్త్రం ప్రకారం, పూర్వీకుల ఫోటోలు ఇంట్లోని పూజగదిలో ఉంచకూడదు. ఇంట్లో దేవుడి సన్నిధిలో పూర్వీకుల చిత్రాలను ఉంచితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, తగాదాలు ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి పూజగదిలో పూర్వీకుల చిత్ర పటాలు ఉంచకూడదు. వాటిని ప్రత్యేకమైన స్థానంలో ఉంచాలి. పగిలిన ఫొటోలు: కొంతమంది ఇళ్లలోని పూజ గదిలో దేవుడి విగ్రహాలు పెడుతుంటారు. మరికొందరు చిత్ర పటాలను పెట్టి పూచిస్తుంటారు. అయితే చిరిగిన ఫొటోను ఎప్పుడూ కూడా పూజగదిలో ఉంచకూడదు. ఇలా ఉంచితే దేవుడి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. చిరిగిన ఫొటో స్థానంలో కొత్త ఫొటోను ఉంచాలి. చిరిగిన దేవుడి బొమ్మ లేదా చిరిగిన మతపరమైన పుస్తకాన్ని ఇంటి గుడిలో ఉంచుకోవడం వల్ల కూడా నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాంటి ఇంట్లో దుఃఖం ఉంది. అంతేకాదు దేవుడి గదిలో వాడినపోయిన పువ్వులను కూడా ఉంచకూడదు. ఒకటి కంటే ఎక్కువ శంఖం: వాస్తు శాస్త్రం ప్రకారం, ఆలయంలో ఒకటి కంటే ఎక్కువ శంఖాలు ఉంచకూడదు. చాలా మంది తమ గుడిలో అనేక శంఖాలను ఉంచుతారు కానీ వాస్తు శాస్త్రం దృష్ట్యా అలా చేయడం తప్పు. విరిగిన విగ్రహం: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ఆలయంలో రుద్రుని విగ్రహాన్ని ఎప్పుడూ ప్రతిష్టించవద్దు. విరిగిన విగ్రహాన్ని కూడా ఉంచవద్దు. అలాంటి విగ్రహాన్ని పూజించడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. పూజా సామగ్రి: వాస్తు శాస్త్రం ప్రకారం, పూజ సమయంలో ఉపయోగించే పూజ సామగ్రిని ఇంటి గుడిలో ఉంచకూడదు. అలాగే ఆలయాన్ని రోజూ శుభ్రం చేయాలి. ఇంటి గుడి అపరిశుభ్రంగా లేదా మురికిగా ఉంటే ఆ ఇంట్లో సంతోషం, శాంతి ఉండదు. ఇది కూడా చదవండి: ఉపఎన్నిక.. ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్ #vastu-tips #dharma-astha #dharma-culture మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి