Diwali Shopping: దీపావళి ముగిసింది. దీపాలు వెలిగించడం.. టపాసులు కాల్చడం.. అన్నీ పూర్తి అయిపోయాయి. ఇవే కాకుండా స్వీట్స్, గిఫ్ట్స్, ఆఫర్లతో షాపింగ్స్ ఇవన్నీ దీపావళికి సహజంగా జరుగుతాయి. ఈ సంవత్సరం దీపావళికి ప్రజలు షాపింగ్ తో రికార్డులు బద్దలు కొట్టారు. ఒకటీ రెండూ కాదు ఏకంగా.. రూ.3.75 లక్షల కోట్ల రూపాయలు షాపింగ్ కోసం ఖర్చు చేశారు. ఇందులో టపాసుల ఖర్చు లేదు.
అవును, ఈసారి దీపావళికి షాపింగ్ చేసిన రికార్డులన్నీ బద్దలయ్యాయి. దీపావళి సందర్భంగా ప్రజలు ఎక్కువ డబ్బుతో ఏమి కొన్నారో తెలుసుకుందాం.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) జాతీయ అధ్యక్షుడు బిసి భారతియా, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ఈ వివరాలతో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం ఈ ఏడాది దీపావళి సీజన్‌లో దేశవ్యాప్తంగా మార్కెట్‌లలో రికార్డు స్థాయిలో రూ.3.75 లక్షల కోట్లకు పైగా వ్యాపారం(Diwali Shopping) జరిగింది. ఈ పండక్కి భారతీయ వస్తువులను కస్టమర్లు విరివిగా కొనుగోలు చేశారు. గోవర్ధన్ పూజ, భయ్యా దూజ్, ఛత్ పూజ, తులసి వివాహం వంటి పండుగలు ఇంకా మిగిలి ఉన్నాయ. ఈ పండగల్లో 50 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Also Read: రామాయణం చెప్పే ఫైనాన్షియల్ పాఠాలు ఇవే.. డబ్బు లెక్కలకూ రామకథ ఆదర్శమే!
చైనాకు నష్టమే..
ఈసారి దీపావళి పండుగ రోజున చైనా రూ.లక్ష కోట్లకు పైగా వ్యాపారంలో భారీ నష్టాన్ని చవిచూసింది. గత సంవత్సరాల్లో, దీపావళి పండుగల సమయంలో, చైనా నుంచి తయారైన వస్తువులకు భారతదేశంలో దాదాపు 70% మార్కెట్ లభించేది. ఇది ఈ సమయంలో అందుబాటులో లేదు. దేశంలోని ఏ వ్యాపారవేత్త కూడా ఈ ఏడాది దీపావళికి సంబంధించిన ఏ వస్తువును చైనా నుంచి దిగుమతి చేసుకోలేదు. CAT ఈ దీపావళికి దేశవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తి-సబ్కా ఉస్తాద్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది చాలా విజయవంతమైంది. దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి భారీ మద్దతు దొరికింది.
వీటి అమ్మకాలు ఎక్కువ..
స్థూల అంచనా ప్రకారం రూ. 3.5 లక్షల కోట్ల పండుగ వ్యాపారంలో 13% ఆహారం - కిరాణా, 9% ఆభరణాలు, 12% బట్టలు వస్త్రాలు, 4% డ్రై ఫ్రూట్స్, స్వీట్లు - 4% అని ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. స్నాక్స్, గృహోపకరణాలలో 3%. గృహోపకరణాలు, 6% సౌందర్య సాధనాలు, 8% ఎలక్ట్రానిక్స్ & మొబైల్‌లు, 3% పూజ సామాగ్రి & పూజ వస్తువులు, 3% పాత్రలు & వంటగది ఉపకరణాలు, 2% బేకరీ, 8% గిఫ్ట్ ఆర్టికల్స్, 4% ఫర్నిచర్ ఉన్నాయి. ఇక మిగిలిన 20% ఆటోమొబైల్స్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, బొమ్మలు.. అనేక ఇతర వస్తువులు- సేవలపై కస్టమర్‌లు ఖర్చు చేశారు. ఈ దీపావళికి దేశవ్యాప్తంగా ప్యాకింగ్ వ్యాపారం కూడా పెద్ద మార్కెట్‌ను సంపాదించుకుంది.
Watch this interesting Video: