Diwali Crackers: టపాసుల ధరలు పేలిపోతున్నాయా? హైదరాబాద్‌లో అక్కడ చాలా చీప్ బాసూ! దీపావళి సందర్భంగా హైదరాబాద్‌లోని కొన్ని క్రాకర్స్ దుకాణాల్లో టపాసులు కేజీల లెక్కన అమ్ముతున్నారు. గతేడాదితో పోల్చితే ధరలు 20-30శాతం పెరగడంతో సామాన్యులు ఈ షాపుల ముందు బారులు తీరుతున్నారు. By Trinath 11 Nov 2023 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి టపాసులు(Fire Crackers) కొందం అని డాడీని పట్టుకోని షాప్‌కు వెళ్లాడు బంటి. హోల్‌సేల్ ధరలని బోర్డు ఉండడంతో ఇద్దరు షాప్ లోపలికి హ్యాపీగా వెళ్లారు. లోపల ఎన్నో రకాల క్రాకర్స్ ఉన్నాయి.. అవన్ని చూడగానే బంటిగాడు కేరింతలు కొట్టాడు.. బంటి మురిసిపోతుంటే వాళ్ల డాడీ కూడా నవ్వుకున్నాడు. ముందుగా చిచ్చుబుడ్డులు దగ్గరకు వెళ్లారు.. 'ఇవి ఎంత' అని అడిగాడు.. షాప్ అబ్బాయి చెప్పిన మాట విని తండ్రి కంగుతిన్నాడు. కాకరపువ్వొత్తుల నుంచి సీమటపాసులు, థౌజండ్ వాలా వరకు ప్రతీ ధర పేలిపోయేలా ఉంది. బంటి వాళ్లది మధ్యతరగతి కుటుంబం. డాడీ క్రాకర్స్ కొనకుండా అటు ఇటు తిప్పుతిన్నాడని అప్పటికే బంటి బిక్కముఖం పెట్టేశారు. బంటికి ఏం చెప్పాలో తండ్రికి అర్థంకాలేదు. ఇంతలోనే ఫోన్ రింగ్ అయ్యింది. ఎవరో ఫ్రెండ్ కాల్ చేశాడు. 'ఎక్కడున్నావ్.. ఏంటి' అని ఆరా తీశాడు. జరిగిన విషయాన్ని బాధగా చెప్పాడు బంటి వాళ్ల డాడీ.. అయితే అవతలి వైపు నుంచి వచ్చిన సమాధానంతో ఆయన ముఖం రాకెట్ లైటింగ్ లాగా వెలుగిపోయింది. అక్కడ నుంచి రయ్ రయ్‌మంటూ వెళ్లిపోయారు. ఎక్కడికో తెలుసా? తెలియకపోతే తప్పక తెలుసుకోండి. హైదరాబాద్ లో కేజీల లెక్క క్రాకర్స్ అమ్మకాలు పదండి..పదండి.. కేజీ బియ్యం కాదు.. కేజీ బాంబులు కొందం పదండి: అవును.. మీరు చదివింది నిజమే.. ఇలాంటి సీన్స్ హైదరాబాద్‌లో జరుగుతున్నాయి, జరిగాయి కూడా. అయితే ఎక్కడకు వెళ్లారనే కదా మీ డౌట్..! హైదరాబాద్‌లో మధ్యతరగతి ప్రజలకు ఇది నిజంగా మంచి విషయమే. కొన్ని దుకాణాల్లో టపాసులు కేజీల లెక్క అమ్ముతున్నారు. తెలివిగా ప్లాన్ చేసుకుంటే తక్కువ ధరకే బొలేడు బాంబులు ఇంటికి తెచ్చుకోవచ్చు.. హ్యాపీగా కాల్చుకోవచ్చు.. అప్పు చేయకుండానే ఫెస్టివల్‌ను ఎంజాయ్ చేయవచ్చు. హైదరాబాద్‌లోని షేక్‌పేట్, బండ్లగూడ జాగిర్, ఎస్‌ఆర్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పుడు కేజీల లెక్క టపాసులు అమ్ముతున్నారు. వీటిలో తాడులు, కాకరపువ్వొత్తుల, చిచ్చుబుడులు లాంటివి ఉన్నాయి. పేలే బాంబులు కూడా ఉన్నాయి. కేజీ రూ.499, రూ.599, రూ.699 చొప్పున క్రాకర్స్ అమ్ముతున్నారు. అటు గతేడాదితో కంపేర్ చేస్తే ఈ ఏడాది టపాసుల ధరలు 20 నుంచి 30శాతం వరుకు పెరిగినట్లు సమాచారం. బండ్లగుడా లో కేజీల లెక్క టపాసుల సేల్ చీపా? చీటింగా? దీపావళి క్రాకర్స్ కేజీల లెక్క అమ్ముతుండడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఈ షాపుల ముందు బారులు తీరుతున్నారు. తమ పిల్లల ఆనందంతో పాటు తక్కువ ధరకే టపాసులు అందుబాటులో ఉండడంతో ఈ కేజీల షాపల ముందు క్యూ కడుతున్నారు. అయితే ఇదంతా చీటింగ్ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చీప్ ప్రైస్‌కు దొరుకుతుందని వెళ్తే 'అట్టపెట్టల' బరువుతో మోసం చేస్తున్నారంటున్నారు. టపాసులు పెడుతున్న బాక్సుల బరువు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే బాక్స్ లేకుండానే కొన్ని షాపుల్లో క్రాకర్స్ వెయిట్ చూసి అమ్ముతున్నారని మరి కొందరు అంటున్నారు. ఇంకొందరేమో వెయిట్ మెషీన్‌లోనే ఎదో తేడా ఉందని.. కరెక్ట్ బరువు చూపించడంలేదని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పేద, మధ్యతరగతి ప్రజలు క్రాకర్స్ కొనుగోలులో తెలివిగా వ్యవహరించడం మంచిది. లేకపోతే జేబులు కాలిపోతాయ్ బాబోయ్..! Also Read: పండుగ వేళ పోలీసుల షాక్.. 2 గంటలే టపాసులు కాల్చేందుకు పర్మిషన్! WATCH: #fire-crackers #diwali-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి