Disha Police Station: గత వైసీపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు సంబంధించిన పలు సమస్యలపై ఈ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేసేలా, వారి సమస్యలను పరిష్కరించుకునేలా వీటిని అందుబాటులోకి తెచ్చింది.
Also Read: నా ఇల్లును కూల్చివేయండి.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
అయితే, ఈ దిశ పోలీస్ స్టేషన్లపై గతంలో టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం నామ మాత్రంగా దిశ స్టేషన్లను ఏర్పాటు చేశారని.. బాధ్యులకు సరైన న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తాజాగా దిశ పేర్లను మార్చింది. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.