AP: దిశ పోలీస్ స్టేష‌న్ల పేరు మార్పు.. కొత్త పేరు ఇదే..!

ఏపీలో దిశ పోలీస్ స్టేష‌న్ల పేర్లను మారుస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మార్చింది. వైసీపీ ప్రభుత్వం.. మహిళలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేలా దిశ పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

New Update
AP: దిశ పోలీస్ స్టేష‌న్ల పేరు మార్పు.. కొత్త పేరు ఇదే..!

Disha Police Station: గత వైసీపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు సంబంధించిన పలు సమస్యలపై ఈ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేసేలా, వారి సమస్యలను పరిష్కరించుకునేలా వీటిని అందుబాటులోకి తెచ్చింది.

Also Read: నా ఇల్లును కూల్చివేయండి.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

అయితే, ఈ దిశ పోలీస్ స్టేషన్లపై గతంలో టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం నామ మాత్రంగా దిశ స్టేషన్లను ఏర్పాటు చేశారని.. బాధ్యులకు సరైన న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తాజాగా దిశ పేర్లను మార్చింది. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు